ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్‌లో కొత్త రికార్డు.. 7.28 కోట్లు దాటిన ఐటీఆర్స్..!
ITR Filing | గత ఆర్థిక సంవత్సరం ( 2023-24) ఐటీ రిటర్న్స్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. 2022-23 ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే 7.5 శాతం వృద్ధితో 7.28 కోట్ల పై చిలుకు ఐటీఆర్‌లు నమోదయ్యాయని ఆదాయం పన్ను విభాగం శుక్రవారం తెలిపింది.
ITR Filing | గత ఆర్థిక సంవత్సరం ( 2023-24) ఐటీ రిటర్న్స్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. 2022-23 ఐటీ రిటర్న్స్‌తో పోలిస్తే 7.5 శాతం వృద్ధితో 7.28 కోట్ల పై చిలుకు ఐటీఆర్‌లు నమోదయ్యాయని ఆదాయం పన్ను విభాగం శుక్రవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31తో గడువు ముగిసింది.
2024-25 అంచనా సంవత్సర ఐటీ రిటర్న్స్ జూలై 31 నాటికి 7.28 కోట్లకు పైగా ఫైల్ అయ్యాయి. 2023-24 అంచనా సంవత్సర ఐటీ రిటర్న్స్ 6.77 కోట్ల ఫైలింగ్స్ తో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘2024-25 అంచనా సంవత్సరంలో మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్ ఫైలింగ్స్‌లో కొత్త ఆదాయం పన్ను విధానం కింద 5.27 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ కాగా, పాత ఆదాయం పన్ను విధానం కింద 2.01 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి’ అని వివరించింది. దీంతో పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 72 శాతం మంది కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకుంటే, 28 శాతం మంది పాత ఆదాయం పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేశారు.
2024-25 అంచనా సంవత్సరంలో అడిటింగ్ అవసరం లేని వేతన జీవులు ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2024 జూలై 31 తుది గడువు. ఒక్క రోజే అత్యధికంగా 69.92 లక్షల ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయి. తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసిన వారు 58.57 లక్షల మంది ఉన్నారు. ఆదాయం పన్ను పరిధి విస్తృతం అవుతుందని చెప్పడానికి ఇది సంకేతం అని ఆదాయం పన్ను విభాగం వివరించింది.
ఐటీఆర్ ఫైల్ చేయడం కోసం ఆదాయం పన్ను విభాగం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన.. అంటే ఆర్థిక సంవత్సరం తొలి రోజే ‘ఈ-ఫైలింగ్ పోర్టల్’లో ఐటీఆర్ ఫామ్స్ (ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4, ఐటీఆర్-6) అందుబాటులోకి తెచ్చింది. ఇలా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాడే ఐటీఆర్ ఫామ్స్ అందుబాటులోకి తేవడం చారిత్రాత్మకంగా నిలిచింది.
మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌ల్లో ఐటీఆర్ -1 ఫామ్ కింద 45.77 శాతం అంటే 3.34 కోట్లు, ఐటీఆర్-2 ఫామ్ కింద 1.09 కోట్ల మంది (14.93 శాతం), ఐటీఆర్-3 ఫామ్ కింద 91.10 లక్షల మంది (12.5 శాతం0, ఐటీఆర్ -4 ఫామ్ కింద 1.88 కోట్ల మంది (25.77 శాతం), ఐటీఆర్ -5 నుంచి ఐటీఆర్ -7 ఫామ్స్ వరకూ 7.48 లక్షల మంది (1.03 శాతం) ఐటీఆర్ ఫైల్ చేశారు. 43.82 శాతం మంది ‘ఈ-ఫైలింగ్ పోర్టల్’లో ఆన్ లైన్ ఐటీఆర్ యుటిలిటీ సేవలను వినియోగించుకుని ఐటీఆర్ ఫైల్ చేస్తే, మిగతా వారు ఆఫ్ లైన్ చానళ్ల ద్వారా దాఖలు చేశారు.
మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌ల్లో 6.21 కోట్ల పై చిలుకు ఐటీఆర్‌ల ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. వాటిలో ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా 5.81 కోట్ల పై చిలుకు (93.56 శాతం) మంది ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. జూలై 31 వరకూ వేతన జీవులు, ఐటీ ఫైల్ చేస్తున్న వారి నుంచి వచ్చిన సుమారు 10.64 లక్షల సందేహాలను ఈ-ఫైలింగ్ హెల్ప్ డెస్క్ నివృత్తి చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

