Virat Kohli : ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటకు సిద్ధమైన అథ్లెట్ల బృందానికి క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓ సందేశం పంపాడు. జూలై 26న విశ్వ క్రీడల ఆరంభం కానున్న నేపథ్యంలో.. కోట్లాది మంది భారతీయుల కలల్ని మోసుకెళ్లిన భారత స్క్వాడ్‌కు వీడియో మెసేజ్ ద్వారా కోహ్లీ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పాడు. రక్తాన్ని, చెమటను చిందించి మెగా టోర్నీకి అర్హత సాధించిన ఒలిపింక్ సైన్యానికి యావత్ భారతం మద్దతుగా నిలవాలని విరాట్ పిలుపునిచ్చాడు.
ఇండియా, భారత్, హిందూస్తాన్.. ఒకానొక కాలంలో భారత దేశమంటే పాములు పట్టేవాళ్లతో, ఏనుగులతో కూడినది అని ప్రపంచమంతా అనుకునేది. అయితే.. కాల క్రమంలో ఆ ఆలోచన మారింది. ఈరోజు మనదేశం ప్రపంచంలోనే అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అందరికీ తెలుసు. భారత్ ఇప్పుడు అంతర్జాతీయ సాంకేతిక కేంద్రం. ఇదొక్కటే కాదు క్రికెట్, బాలీవుడ్, యూనికార్న్ స్టార్టప్ కంపెనీలతో పాటు ప్రపంచంలోనే అభివృద్ది చెందుతున్న అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేరుగాంచాం. ఇలాంటి గొప్ప దేశానికి అవసరమైన పెద్ద విజయం ఏం కావాలి? ఎక్కువ బంగారం, వెండి, కాంస్య పతకాలు అంతే.
From dreams to medals.🏅
It’s time to back our athletes as they step foot into Paris!✊🏼🇮🇳@IIS_Vijayanagar @StayWrogn #JaiHind #WeAreTeamIndia #Paris2024 #RoadToParis2024 #StayWrogn pic.twitter.com/pbi7TYWjsN— Virat Kohli (@imVkohli) July 15, 2024
ఒలింపిక్ పతకం సాధించాలనే ఆకలితో మన సోదరులు, సోదరీమణులు ప్యారిస్‌కు వెళ్లారు. అథ్లెట్లు కోర్టులో నెర్వస్‌గా, ఒత్తిడిగా కనిపించడం వందల కోట్ల మంది చూడబోతున్నారు. ఈ సమయంలో భారత దేశ నలుమూలల నుంచి ఇండియా.. ఇండియా.. ఇండియా అనే నినాదాలు మీ చెవిలో మార్మోగుతాయి. చెక్కుచెదరని పట్టుదలతో మన అథ్లెట్లు సగర్వంగా పోడియం మీదకు వెళ్లడానికి దగ్గరైన వేళ వాళ్లను ఉత్సాహపరిచేందుకు నాతో చేతులు కలపండి అని కోహ్లీ స్ఫూర్తిదాయక మాటలతో వీడియోను ముగించాడు.

నిరుడు ఆసియా గేమ్స్‌లో పతక ”వంద’నం చేసిన భారత అథ్లెట్లు.. ఈసారి ఒలింపిక్స్‌లో పతకాలు గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబురమైన ఈ పోటీల్లో 118 మందితో కూడిన భారత బృందం బరిలోకి దిగుతోంది. వీళ్లలో 48 మంది మహిళా అథ్లెట్లు 16 విభాగాల్లో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. 118 మందిలో 26 మంది ఖేలో ఇండియా అథ్లెట్లు కాగా తొలిసారి విశ్వ క్రీడలకు అర్హత సాధించిన వాళ్లు 72 మంది ఉన్నారు.
