Roshaiah | దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ (86) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్‌పేటలోని స్వగృహంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శివలక్ష్మీ మరణం వారి కుటుంబంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ విషాదం నింపింది. రోశయ్య సతీమణి శివలక్ష్మీ మరణం పట్ల రాజకీయ నాయకులు నివాళులర్పిస్తున్నారు.