Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తానే వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అందులో ఓ స్క్రీన్‌షాట్‌ను పోస్టు చేశారు.
వికీపీడియా పేజిని పోలినట్లుగా ఉన్న ఎడిటెడ్ ఫొటోను ట్రంప్ పోస్టు చేశారు. అందులో డోనాల్డ్ ట్రంప్ ఫొటో కింద వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినట్లుగా ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాది మొదట్లో వెనెజువెలాపై అమెరికా సైన్యం దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు మదురో, ఆమె సతీమణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సైనిక చర్య అనంతరం వెనెజువెలాలో సేఫ్‌గా ఉండేంత వరకు తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ట్రంప్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. దీంతో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డెల్సీ రెడ్రిగ్జో యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె తమకు నచ్చినట్లుగా వ్యవహరించాలని.. లేదంటే మదురో కంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అప్పట్లో ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, వెనెజువెలా ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ పోస్టు రాజకీయంగా సంచలనంగా మారింది.