తిరువనంతపురం: ఒక పోలీస్ తన కారుకు పెట్రోల్ నింపుకున్నాడు. ఆ తర్వాత డబ్బులు చెల్లించకుండా పెట్రోల్ బంకు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న సిబ్బందిని కారుతో ఢీకొట్టడంతో అతడు బానెట్‌పై పడ్డాడు. అయినా ఆగకుండా కిలోమీటరు దూరం కారు డ్రైవ్ చేశాడు. (Cop Drives Car With Petrol Pump Staff On Bonnet) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో ఆ పోలీస్‌ను అరెస్ట్ చేయడంతోపాటు సస్పెండ్ చేశారు. కేరళలోని కన్నూర్‌లో ఈ సంఘటన జరిగింది. పోలీస్ డ్రైవర్ సంతోష్ కుమార్ ఆదివారం సాయంత్రం కారులో పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. కారులో పెట్రోల్ నింపుకున్న తర్వాత డబ్బులు చెల్లించలేదు. ఈ విషయంపై బంకు సిబ్బంది అనిల్‌తో వాదనకు దిగాడు.
కాగా, ఆ పోలీస్ డ్రైవర్ కారులో అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా అనిల్ అడ్డుగా నిల్చొన్నాడు. దీంతో అతడ్ని ఢీకొట్టడంతో బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ కారును ఆపకుండా కిలోమీటరు దూరం డ్రైవ్ చేశాడు. చివరకు బిజీ రోడ్డు వద్ద కారును ఆపాడు. పెట్రోల్ బంకు సిబ్బంది అనిల్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.
మరోవైపు అనిల్ ఫిర్యాదుతో పోలీస్ డ్రైవర్ సంతోష్ కుమార్‌పై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడంతోపాటు సస్పెండ్ చేశారు. కాగా, ఆ పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
പെട്രോൾ അടിച്ചതിൻ്റെ പണം ചോദിച്ച ജീവനക്കാരനെ കാറിൻ്റെ ബോണറ്റിലിരുത്തി സ്റ്റേഷൻ വരെ ഓടിച്ചു #kannur #keralapolice #zeemalayalamnews pic.twitter.com/YwdX0oXI3t
— Zee Malayalam News (@ZeeMalayalam) July 15, 2024