MSG | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG)జనవరి 12న థియేటర్లలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రీమియర్, పెయిడ్ షోలు నుండే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించడంతో సినిమా సంక్రాంతి 2026 విజేతగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటోలు, వీడియోలు ద్వారా డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల చిరంజీవితో కలిసి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్న క్షణాలను అభిమానులు ఆస్వాదిస్తున్నారు. ప్రేక్షకులు సినిమా బ్లాక్‌బస్టర్ అని, “బాస్ ఇస్ బ్యాక్” అంటూ సోషల్ మీడియా వేదికగా రివ్యూలు, కామెంట్స్‌తో వైరల్ అవుతున్నారు.
ముఖ్యంగా చిరంజీవి యాక్టింగ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి టేకింగ్, నయనతార నటన, వెంకటేష్ స్పెషల్ కామెడీ సీన్స్ మొత్తం సమన్వయంగా ఆడియెన్స్‌ను అలరించాయని అభిమానులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ కూడా సినిమా హైలెట్స్‌గా నిలిచాయి. సినిమాలో చిరంజీవిని ఎలా వాడుకోవచ్చో అలా వాడుకొని సృజనాత్మకంగా చూపించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి . వెంకటేష్ 20 నిమిషాల మాత్రమే కనిపించిన, తన కామెడీ సీన్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. నయనతార తన అందంతో మాత్రమే కాదు, నటనలోనూ కొత్త ఆకర్షణ చూపించింది. మిగిలిన కాస్టింగ్ సభ్యులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
పాత కథాంశాన్ని ఆధునిక, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టైల్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అందించడంలో మరోసారి సక్సెస్ అయ్యారని సినీ విశ్లేషకులు అంటున్నారు. సంపూర్ణంగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి బాక్సాఫీస్‌లో మెగా హిట్ అయ్యే అవకాశం ఉన్న సినిమా అని ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రం సంక్రాంతిని క్యాష్ చేసుకొని భారీ వసూళ్లు రాబట్టడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.
A beautiful moment celebrating a MEGA BLOCKBUSTER RESPONSE 😀❤️🔥
Hit Machine, director @AnilRavipudi, producers @sahugarapati7 & @sushkonidela met Megastar @KChiruTweets to share the happiness after the blockbuster response from the premieres of #ManaShankaraVaraPrasadGaru 🔥… pic.twitter.com/ZL8Tsch547
— Gold Box Entertainments (@GoldBoxEnt) January 11, 2026