Virat Kohli | హ్యాపీ బర్త్‌డే కోహ్లీ.. వైరలవుతున్న సైకత శిల్పం వీడియో
Virat Kohli : ప్రపంచ క్రికెట్లో ఛేజ్మాస్టర్గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆదివారం 35వ పడిలోకి అడుగుపెట్టాడు. దాంతో సోషల్‌మీడియాలో ఈ భారత స్టార్ ఆటగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ సైకత శిల్పి...
Virat Kohli : ప్రపంచ క్రికెట్లో ఛేజ్మాస్టర్గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆదివారం 35వ పడిలోకి అడుగుపెట్టాడు. దాంతో సోషల్‌మీడియాలో ఈ భారత స్టార్ ఆటగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్(Sudarshan Patnaik) తనదైన స్టయిల్లో కోహ్లీకి విషెస్ చెప్పాడు.
ఒడిశాలోని పూరీలో సముద్ర తీరం ఒడ్డున ఇసుకతో కోహ్లీ సైకత శిల్పానికి రూపమిచ్చాడు. బ్లూ జెర్సీలో ఉన్న కోహ్లీ ఫొటో పక్కన హ్యాపీ బర్త్ డే విరాట్ అని రాశాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ‘విరాట్ కోహ్లీకి ఇసుక బొమ్మతో బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నా. వరల్డ్ కప్‌లో భారత జట్టుకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా’ అని పట్నాయక్ పేర్కొన్నాడు.
#WATCH | Odisha: Sand artist Sudarshan Patnaik created a sand sculpture of Indian cricketer Virat Kohli on the occasion of his birthday, in Puri. pic.twitter.com/AT8KBA08Ek
— ANI (@ANI) November 5, 2023
నిరుడు ఆసియా కప్‌లో ఫామ్ అందుకున్న విరాట్.. సొంత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఈ రన్ మెషిన్ వన్డేల్లో 48 శతకం ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకపై సెంచరీతో కదం తొక్కిన విరాట్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

టీమిండియా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో తలపడనుంది. సమఉజ్జీల ఈ సమరంలో కోహ్లీ సెంచరీ కొట్టాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో కోహ్లీ 442 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి
-
Naveen-ul-Haq | మానవ హక్కుల కంటే రెండు పాయింట్లు ముఖ్యమా?.. అప్గన్ పేసర్ షాకింగ్ కామెంట్స్
-
Delhi | ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
-
Naya Mall | తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచీ.. ధర ఎంతంటే..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

