Naya Mall | తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచీ.. ధర ఎంతంటే..
Naya Mall | ఇది ‘స్మార్ట్' యుగం. చేతిలోని ఫోన్ నుంచి చేతికుండే వాచీ దాకా.. అంతా ‘స్మార్ట్'మయమే! కొత్తకొత్త ఫీచర్లు, సరికొత్త డిజైన్లతో రోజుకోరకం స్మార్ట్‌వాచీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్ని వచ్చినా.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండేవాటికే జనాలు ఓటేస్తారు. వారిని దృష్టిలో పెట్టుకుని ‘క్రాస్‌బీట్స్' సంస్థ ‘ఆరా స్పోర్ట్స్' స్మార్ట్‌వాచీలను తీసుకొచ్చింది.
Naya Mall | మరింత స్మార్ట్ గా..
ఇది ‘స్మార్ట్’ యుగం. చేతిలోని ఫోన్ నుంచి చేతికుండే వాచీ దాకా.. అంతా ‘స్మార్ట్’మయమే! కొత్తకొత్త ఫీచర్లు, సరికొత్త డిజైన్లతో రోజుకోరకం స్మార్ట్‌వాచీలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఎన్ని వచ్చినా.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండేవాటికే జనాలు ఓటేస్తారు. వారిని దృష్టిలో పెట్టుకుని ‘క్రాస్‌బీట్స్’ సంస్థ ‘ఆరా స్పోర్ట్స్’ స్మార్ట్‌వాచీలను తీసుకొచ్చింది. 1.46 ఇంచుల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తున్న ఈ వాచీలో బ్లూటూత్ కాలింగ్, ఇన్‌బిల్ట్ గేమ్స్, ఫాస్ట్‌ఛార్జింగ్, రొటేటింగ్ క్రౌన్, 123+ స్పోర్ట్స్ మోడ్స్లాంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్, ఐపీ67 వాటర్ రెసిస్టెంట్.. ప్రధాన ఆకర్షణ. ఐదు రంగుల్లో లభ్యమయ్యే ఈ వాచీ ఖరీదు 3,199. ప్రముఖ ఆన్లైన్ స్టోర్లలో ఇది లభ్యమవుతుంది. నవ్యతను కోరుకునేవారికి అత్యుత్తమ స్మార్ట్‌వాచ్.
బ్యాంగ్‌బ్యాంగ్.. హెడ్‌బ్యాండ్!
ఫ్యాషన్ ప్రపంచంలో అతివలదే అగ్ర తాంబూలం! అందులోనూ హెయిర్ ైస్టెలింగ్దే ప్రథమ స్థానం! రోజుకో కొత్త పోకడలు పోయే ఫ్యాషన్‌రంగంలో అప్పుడెప్పుడో మొదలై.. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండేవి కొన్నే! అందులో ముందువరుసలో ఉంటాయి హెడ్బ్యాండ్లు. పిల్లలైనా, పడుచు పిల్లలైనా.. హెయిర్ ైస్టెలింగ్ అంటే హెడ్‌బ్యాండ్ ఉండాల్సిందే! వారికోసమే టోపీల తయారీలో అగ్రగామి అయిన బ్రిటన్ సంస్థ.. ‘ల్యాక్ అండ్ కో’ సరికొత్త హెడ్బ్యాండ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నప్పా లెదర్‌తో తయారైన ఈ బ్యాండ్లు.. పార్టీలకైనా, ఫంక్షన్లకైనా.. అన్ని రకాల దుస్తులకూ నప్పుతాయి. చేతితో అల్లిన కామెల్లియాలు ఈ బ్యాండ్లకు ప్రత్యేక ఆకర్షణ. నీలం, గులాబీ రంగులతోపాటు నలుపు రంగులలో లభించే ఈ హెయిర్బ్యాండ్ల ధర 75,498. shop@lockhatters.co.ukలో కొనుగోలు చేయవచ్చు.
బుట్ట బొమ్మ.. వెండి కొండ!
ఇంతకుముందు చెవి బుట్టాలు అంటే.. బంగారంతో చేసినవే! కానీ, ఇప్పుడలా కాదు. మెటీరియల్ ఎంత డిఫరెంట్‌గా ఉంటే అంత ఫ్యాషనబుల్ అన్నట్టు! అంతేకాదు.. బంగారం ధర ఎక్కువ. అందుకే తక్కువ ధరలో, ట్రెండీగా ఉండేలా వెండితోనూ బుట్టాలు రూపొందుతున్నాయి. ప్రముఖ నగల తయారీ సంస్థ ద్విభూమి.. వెండితో సరికొత్త చెవి బుట్టాలను తయారు చేసింది. ‘అత్రి డోమ్ డాంగ్లర్స్’ పేరుతో.. ఇస్లామిక్ నిర్మాణశైలి డోమ్ (గోపురం) ఆకృతిలో వీటిని మలిచింది. ఫ్యాషన్‌తోపాటు సంప్రదాయాన్నీ ఇష్టపడే నేటితరం మహిళల కోసమే వీటిని ప్రత్యేకంగా రూపొందించినట్లు తయారీ సంస్థ ద్విభూమి చెబుతున్నది. వీటి ధర 23,700. dvibhumi.comలో ఆర్డర్ చేయవచ్చు.
ప్రయాణం.. అందంగా.. ఆనందంగా!
ప్రయాణాల్లో ప్రధాన సమస్య.. బ్యాగేజీ! అందులోనూ విమాన ప్రయాణం అంటే మరీనూ! తక్కువ బరువుండే బ్యాగుల్నే తీసుకెళ్లాలి. అయితే, ఇవి అంత ట్రెండీగా కనిపించవు. ఈ సమస్యను గుర్తించిన ‘క్యాప్రీస్’ సంస్థ.. ‘ఎయిర్పోర్ట్ కలెక్షన్’ పేరుతో ట్రావెల్ ఫ్రెండ్లీ.. ైస్టెలిష్ కలెక్షన్‌ను రూపొందించింది. భారత్‌కు చెందిన ఈ బ్యాగుల తయారీ సంస్థ.. తక్కువ బరువుతోపాటు ట్రెండీగా ఉండేలా పలురకాల హ్యాండ్‌బ్యాగ్‌లు, బ్యాక్
ప్యాక్‌లు, స్లింగ్‌లు, టోట్లను తయారు చేసింది. ముఖ్యంగా కొత్తదనాన్ని కోరుకునే మహిళల కోసం ట్రెండీ లుక్‌లో వీటిని తీసుకొచ్చింది. 1,499 నుంచి 3,998 మధ్య లభించే ఈ ఎయిర్పోర్ట్ కలెక్షన్ క్యాప్రీస్ రిటైల్ దుకాణాలు, వెబ్‌సైట్‌తోపాటు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తాయి.
Read More :
Naya Mall | ఫెరారీ నుంచి అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం




