ఇప్పుడంతా పోర్టబుల్ స్పీకర్ల యుగం. మనం వెళ్లినచోటికంతా స్పీకర్ రావాలని కోరుకుంటాం. స్నేహితులతో కలిసి చదువుకుంటున్నా, మిత్రులతో ముచ్చట్లు పెట్టుకుంటున్నా.. పక్కన స్పీకర్ మోగుతూనే ఉండాలన్నది యూత్ అడ్డాల నియమం. ఆ క్రేజ్ కారణంగానే.. పెద్ద పెద్ద సంస్థలు సైతం వీటి తయారీకి ముందుకొస్తున్నాయి. ప్రఖ్యాత కార్ల ఉత్పత్తి సంస్థ ఫెరారీ, హెడ్ఫోన్లు స్పీకర్ల తయారీలో పేరెన్నికగన్న బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ సంయుక్తంగా ‘బియోసౌండ్ ఎక్స్ప్లోర్ ఫెరారి ఎడిషన్’ పేరిట ఓ పోర్టబుల్ స్పీకర్‌ని తీసుకొచ్చాయి. ఇది వాటర్ ఫ్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కూడా. ఒకసారి ఛార్జింగ్ పెడితే 27 గంటల పాటు పనిచేస్తుంది. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇక సౌండ్ అంటారా.. క్రిస్టల్ క్లియర్! bang-olufsen.comలో అమ్ముతున్నారు. ధర రూ. 20 వేలు.

మనం వాడే రిఫ్రిజిరేటర్లు వాతావరణానికి హాని కలిగించే కార్బన్ డై ఆక్సైడ్‌లాంటి వాయువులను విడుదల చేస్తాయనే సంగతి తెలిసిందే. దీంతో తమ ఉత్పత్తుల్ని పర్యావరణ హితంగా మార్చే ప్రయత్నంలో భాగంగా గోద్రెజ్ సంస్థ ‘ద ఎడ్జ్ నియో’ పేరిట సరికొత్త రిఫ్రిజిరేటర్‌ను తీసుకొచ్చింది. మామూలు వన్‌స్టార్ ఫ్రిజ్‌లతో పోలిస్తే ఇది పదేండ్ల కాలంలో వెయ్యి కిలోలు తక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు, ఏడాది మొత్తం మీద 99 యూనిట్ల కరెంటుతోనే నడుస్తుందట. ఫ్రిజ్‌లోని పదార్థాలు త్వరగా చల్లబడేలా టర్బోకూల్ టెక్నాలజీని ఉపయోగించారు. సూక్ష్మక్రిముల్ని దూరం చేసి.. ఫ్రిజ్‌లోని గాలిని తాజాగా ఉంచే ప్రత్యేక సాంకేతికతనూ ఇందులో వినియోగించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ కామర్స్ సైట్లలోనూ దొరుకుతుంది. ధర సుమారు రూ. 27 వేలు.

మేఘాల్లో వాన సన్నాయి మోగగానే తూనీగలు తాళం మొదలు పెడతాయి. వర్ష సరాగాలు వినిపించబోతున్నాయంటూ తమ గొంతుకలతో గుర్తు చేస్తాయి. అందుకే, ఈ కాలంలో వాటిని చూస్తే మనసుకు ఎంతో ఆనందం. ఆ అనుభూతిని పదిలంగా పట్టి ఉంచేలా ‘బ్రౌన్ డ్రాగన్ జారా నెక్లెస్’ను రూపొందించింది మాయా బజార్ సంస్థ. విభిన్నంగా కనిపించేలా జరీ పోగులతో నెక్లెస్ నేసి, దానికి ఇత్తడి గొలుసుల్ని జోడించారు. మధ్యలో ఇత్తడితోనే చేసిన తూనీగ బొమ్మను పెండెంట్గా మలిచారు. దీంతో ఇటు నిండుగా, అటు ఫ్యాషన బుల్గా.. చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తున్నది తూనీగ గొలుసు. నచ్చితే ogaan.com ద్వారా కొనుక్కో వచ్చు. ధర రూ.2060.

Lense
సన్‌గ్లాసెస్.. ఎప్పుడూ ఫ్యాషన్ ఐకాన్లే. అందులోనూ పేరెన్నికగన్న బ్రాండ్ల చలువ కళ్లద్దాలంటే పడిచచ్చేవాళ్లు చాలా మంది. జర్మన్ బ్రాండ్ పోర్షె డిజైన్ తన 50వ వార్షికోత్సవం సందర్భంగా ‘పోర్షె డిజైన్ పి 8928 50వై’ పేరిట టైటానియం ఫ్రేమ్ కళ్లజోడును తెచ్చింది. దానికి ప్లాటినం సొగసుల్నీ జోడించింది. తీవ్ర అతినీల లోహిత కిరణాల నుంచి కూడా కళ్లను కాపాడగలిగే శక్తి ఈ లెన్స్‌కు ఉంది. బయటికాంతిని బట్టి అద్దాల రంగులు మార్చుకోవచ్చు. త్వరగా పగలని, గీతలు పడని పాలికార్బొనేట్ పదార్థంతో లెన్స్ తయారు చేశారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ సన్గ్లాసుల ధర రూ.52 వేలు. porsche-design.comలో కొనుగోలు చేయవచ్చు.
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు