టీవీ చూడాలంటే ఇంతకు ముందు ఓ టేబుల్ ఉండాలి. ఇప్పుడైతే ఓ గోడ చాలు. కానీ ఊరికే ఆరు బయట కూర్చునీ, కారులో షికారు కెళుతూ కూడా టీవీ చూడగలిగే అవకాశాన్ని కల్పిస్తున్నది ఎల్జీ సంస్థ. బ్రీఫ్‌కేస్ లాంటి బాక్స్‌లో ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకుపోవచ్చు. దీనిపేరు ‘ఎల్జీ స్టాన్బైమీ గో’. 27 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ వైర్లెస్ పరికరం బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. బ్లూటూత్, ఎయిర్ప్లేలాంటి వాటి ద్వారా కనెక్ట్ కావచ్చు. మన ఇష్టాన్ని బట్టి స్క్రీన్‌ను అడ్డంగా, నిలువుగా అమర్చుకోవచ్చు. బాక్స్‌లోనే ఉంచి గేమింగ్ బోర్డులానూ వాడుకోవచ్చు. ఈ టచ్‌స్క్రీన్ టీవీని వాయిస్ కంట్రోల్, రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు.
ధర రూ. 83 వేలు. lg.com ద్వారా కొనుక్కోవచ్చు.
మనం ఏదో కీలకమైన కాల్లో ఉంటాం. లేదంటే ముఖ్యమైన పాఠం వింటుంటాం. సరిగ్గా ఆ సమయానికే బ్యాటరీ లో అయిపోతే కంగారు పడతాం. చార్జింగ్ పెట్టుకుని మాట్లాడే అవకాశం అన్నిసార్లూ ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అద్భుతంగా పనిచేస్తుంది ‘డైలీ ఆబ్జెక్ట్స్ సర్జ్ మ్యాగ్నటిక్ వైర్లెస్ బ్యాటరీ ప్యాక్’. 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న దీనికి ఫోన్‌ను అతికిస్తే చాలు ఎంచక్కా చార్జింగ్ అవుతూ ఉంటుంది. స్టాండ్ సాయంతో ఫోన్‌నూ అమర్చి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మరోవైపు కేబుల్ సాయంతో ఇంకో ఫోన్‌కు అనుసంధానం చేయొచ్చు. అంటే ఒకేసారి రెండు పరికరాలు చార్జింగ్ పెట్టుకోవచ్చన్నమాట. చార్జింగ్ ఎంత ఉందో తెలిపేలా దీని వెనక ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఫోన్లతో పాటు ఇయర్పోడ్ల లాంటివీ దీంతో వైర్‌లెస్‌గా చార్జ్ చేసుకోవచ్చు. ధర. రూ.5,999. dailyobjects.comలో దొరుకుతుంది.
కాలాచష్మా కాలానికి తగినట్టు అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. ఆ విషయాన్ని ఫాస్ట్‌ట్రాక్ కంపెనీ కూడా ఫాస్ట్‌గానే అందుకుంది. అందుకే సరికొత్త చలువ కళ్లద్దాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అందులోనూ అందుబాటు ధరలో రూపొందించింది. ‘ఫాస్ట్‌ట్రాక్ వైబ్స్ 2.0’ కళ్లద్దాల గురించే ఈ ముచ్చటంతా. బ్లూటూత్ 5.0తో మన ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది కాబట్టి, కాల్స్ కూడా మాట్లాడొచ్చు. కథలు, పాటలు వినొచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా నేవిగేషన్ తెలుసుకుంటూ కావాలనుకున్న చోటుకు వెళ్లొచ్చు. ఇందులోని పోలరైజ్డ్ లెన్స్ సూర్యుడి అతినీల లోహిత కిరణాల నుంచి కళ్లను కాపాడతాయి. ఆడామగా ఇద్దరూ ధరించేలా డిజైన్ చేశారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 4 నుంచి 5 గంటలు పనిచేస్తుంది. ఈ కళ్లజోడు ధర రూ. 4 వేలు. eyewear.fastrack.in లో కొనుగోలు చేయవచ్చు.
టీవీ, ఫోన్, ట్యాబ్.. తెర ఏదైనా తోడుగా ఆడియో తప్పనిసరి. అయితే బొమ్మను ఎంత స్పష్టంగా చూస్తున్నామో, అంతే బాగా వినాలని మనకు ఉంటుంది. కాబట్టే, ప్రత్యేక సౌండ్బార్లను అమర్చుకుంటాం. తెరమీది శబ్దాలు మన చుట్టూతా వినిపిస్తున్నాయేమో అనిపించేలా పనిచేస్తుంది ‘గోవో గో సరౌండ్ 200’. ఆక్స్ కేబుల్ ద్వారా టీవీకి అనుసంధానమై మాట పాటలను చక్కగా వినిపిస్తుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లకు కనెక్ట్ అవుతుంది. యూఎస్బీతోనూ జత చేయొచ్చు. ఒకసారి చార్జింగ్ పెడితే పదిగంటలు పనిచేస్తుంది. ప్రత్యేకంగా కనిపించేందుకు రంగు రంగుల్లో వెలిగే ఎల్యీడీలు ఉంటాయి. మొబైల్లో గేమింగ్ అనుభూతి పొందాలంటే చక్కని ఎంపిక ఇది. govo.life వెబ్సైట్లో అమ్ముతున్నారు. ధర రూ.1,199.
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”