Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!
Ring AIR | రెండు గ్రాముల.. ఫిట్నెస్ ఉంగరం! మనం ఎంత శారీరక శ్రమ చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పే ఫిట్నెస్ ట్రాకర్స్ వాచీల రూపంలోనే మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ విషయాలన్నిటినీ చేరవేసే ఓ ఉంగరమూ ఇటీవల మార్కెట్లోకి వచ్చింది. ‘రింగ్ ఎఐఆర్' పేరిట అల్ట్రా హ్యూమన్ సంస్థ దీన్ని తయారు చేస్తున్నది.
Ring AIR | రెండు గ్రాముల.. ఫిట్నెస్ ఉంగరం!
మనం ఎంత శారీరక శ్రమ చేస్తున్నాం అనే విషయాన్ని చెప్పే ఫిట్నెస్ ట్రాకర్స్ వాచీల రూపంలోనే మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ విషయాలన్నిటినీ చేరవేసే ఓ ఉంగరమూ ఇటీవల మార్కెట్లోకి వచ్చింది. ‘రింగ్ ఎఐఆర్’ పేరిట అల్ట్రా హ్యూమన్ సంస్థ దీన్ని తయారు చేస్తున్నది. ఫలానా రోజు ఎన్ని అడుగులు నడిచాం, ఎంత ఎంత వర్కవుట్ చేశాం, ఎంత సేపు నిద్రపోయాం.. తదితర అంశాలన్నీ ఇది ఫోన్ ఆప్ ద్వారా తెలియజేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగంలాంటివి కూడా బేరీజు వేస్తుంది. రోజువారీ నిద్రకు సంబంధించి గ్రాఫ్ తయారు చేసి, మన మానసిక పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చెబుతుంది. దీన్నిబట్టి మనం జీవన విధానంలో మార్పులు చేసుకునే వీలుంది. దాదాపు స్మార్ట్ వాచ్ చేసే పనులన్నీ చేసే ఈ స్మార్ట్ రింగ్ ఖరీదు రూ.24,999. ultrahuman.com వెబ్సైట్ ద్వారా అమ్ముతున్నారు.

ఇంటి దగ్గరే రిపేరు
మబ్బు ముసిరిందంటే గొడుగు విరిసినట్టే. వానకాలాలు కులాసాగా సాగాలంటే గొడుగు భరోసా ఉండి తీరాల్సిందే మరి. అందుకే ప్రతి ఏడాదీ కొత్త కొత్త గొడుగులు తయారవుతూనే ఉంటాయి. అలా ఈ వానకాలం కోసం రూపొందించిన ‘ద నార్త్ ఫేస్ మాడ్యూల్ అంబ్రెల్లా’ కూడా ప్రత్యేకమైందే. ఇందులోని భాగాలన్నిటినీ మనమే అనుసంధానం చేసి గొడుగును తయారు చేసుకోవచ్చు. ఏదైనా రిపేరు వచ్చినా ఇంటి దగ్గరే సరిచేసుకోవచ్చు. పైన పట్టా, లోపలి పుల్లలు, కడ్డీ అన్నీ విడిభాగాలు దొరుకుతాయి. ఏ ఇబ్బంది ఉన్నా సులభంగా బాగు చేసుకోవచ్చు. పైకప్పును రీసైకిల్డ్ నైలాన్తోతయారు చేశారు. పసుపు, నలుపు, తెలుపు, గోధుమ రంగుల్లో తయారవుతున్నాయివి. thenorthface.comలో దొరికే ఈ గొడుగు ధర రూ.5,700.

కళ్లు తిప్పాల్సిందే!
అందాన్ని చూస్తేనో, ఆశ్చర్యంగా అనిపిస్తేనో అనుకోకుండానే కళ్లు తిప్పుతాం. అలాంటి చూపుల వల్ల ఆ సోకుల యజమానికి కాసింత గర్వం, ఇంకాస్త ఆనందం. ముఖ్యంగా పార్టీలప్పుడైతే నలుగురూ తమనే చూడాలని కోరుకునేవారు చాలామంది. ఆ సందర్భానికి అచ్చంగా సరిపోతాయి ‘టిప్సీ గోల్డ్ డిప్డ్ కళ్లజోళ్లు’. సాధారణంగా నలుపు కళ్లద్దాల్లో ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాం. ఇక, దాన్ని నగలా తీర్చిదిద్ది గొలుసులు వేలాడదీస్తే.. ఆ కొత్తదనం గురించి చెప్పాల్సిన పనే లేదు. నగల డిజైనర్ భవ్య రమేశ్ రూపొందించిన గ్లేర్ కిల్లర్ కలెక్షన్ ఈ తరహాదే. ఇందులో నల్ల అద్దాలకు విభిన్నమైన పలకల ఆకృతిలో ఫ్రేమ్ ఇచ్చారు.. దాన్ని చుట్టేస్తూ సన్నటి పూసల గొలుసులు వేలాడదీశారు. వీటికి స్వచ్ఛమైన బంగారు పూత పూశారు. నచ్చితే bhavyaramesh.com ద్వారా కొనుగోలుచేయవచ్చు. ధర రూ.13,420.

టెన్నిస్ కోర్టులో..
రంగురంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ బూట్లు టెన్నిస్ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసినవి. ‘న్యూ బ్యాలన్స్’ సంస్థ ప్రత్యేకంగా ఫ్యుయెల్ సెల్ మిడ్‌సోల్ టెక్నాలజీ పేరిట కాలికి సౌకర్యంగా ఉండే కుషనింగ్‌ను రూపొందిస్తుంది. అదే కుషన్ టెక్నాలజీని జోడించి టెన్నిస్ ఆటగాళ్ల పాదాలకు ఎక్కడెక్కడ సపోర్ట్ అవసరమో అక్కడ ప్రత్యేకంగా తయారు చేసి ‘ఫ్యుయెల్ సెల్ 996v4.5’ పేరిట టెన్నిస్ షూస్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆటాడేప్పుడు కాలికి గ్రిప్, సౌకర్యాన్ని అందించడం వీటి లక్ష్యం. పసుపు, నీలం, ఆకుపచ్చ, బచ్చలపండు రంగు..ఇలా నిండైన వన్నెల్లో చూడగానే విభిన్నంగా కనిపిస్తాయివి. కొనాలనుకుంటే nbshoesindia.comలోకి వెళ్లొచ్చు. ఖరీదు రూ. ఆరువేల పైమాటే!
Read More :
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

