తమ కొత్తింటి ఇంటీరియర్ డిజైనింగ్ కళాత్మకంగా ఉండాలనుకునే వారు తక్కువేం కాదు. అలాంటివారు వాల్ హ్యాంగింగ్స్ నుంచి ఫర్నిచర్ దాకా అన్నీ ఆర్టిస్టిక్గానే ఉండాలని పట్టుబడతారు. ఇలాంటి అభిరుచి ఉన్నవాళ్ల కోసమే అన్నట్టుగా రూపుదిద్దుకుంది వికర్ స్టోరీ చెయిర్. డిజైనర్ ఫర్నిచర్ తయారీ సంస్థలు.. కమ్‌సేకమ్, వికర్ స్టోరీలు సంయుక్తంగా ఈ కుర్చీని తయారుచేశాయి. గడ్డితో అల్లినా లోపల మెటల్ ఉంటుంది. చూసేందుకు ఆర్ట్ పీస్‌లా కనిపించడం, కూర్చునేందుకు సౌకర్యంగా ఉండటం ఈ ఆసనం తయారీ వెనుక ముఖ్య ఉద్దేశం. kamcekam.comలో ఆర్డర్ చేసుకోవచ్చు. ధర సుమారు రూ. 3 లక్షలు.
ఉదయమో సాయంత్రమో జిమ్‌కి వెళ్లి ఒళ్లు కదిలించాలిఅనుకున్నా, కాస్త పరిగెత్తీ, కొద్దిగా నడిచీ ఒంటికి చెమట అంటించాలనుకున్నా… ముందు కంఫర్టబుల్ దుస్తులు ముఖ్యం. ఆ కోవలోకే వస్తుంది అడిడాస్, యోజీ యమమోటో సంస్థలు తయారుచేసిన ట్రాక్టాప్. వై-3 ఎస్ఎస్టీ ట్రాక్ టాప్ పేరిట మార్కెట్లోకి వచ్చిన దీన్ని తొలిపొద్దు సూర్యుణ్ని తలపించే ఎర్రటి రంగులో రూపొందించారు. నైలాన్, కాటన్, ఎలాస్టిక్ మిశ్రమంగా తయారైందీ వస్త్రం. ధర రూ. 31,000. మరిన్ని వివరాలకు చూడండి.. adidas.com.
ఆఫీసుకు వెళ్లినా, ఫంక్షన్‌కు బయల్దేరినా, చివరికి పనిమీద కాలు బయటపెట్టినా హ్యాండ్‌బ్యాగ్ తప్పనిసరి. అందుకే, అందులో ఎప్పటికప్పుడు కొత్తకొత్త రకాలను ఆవిష్కరిస్తాయి యాక్సెసరీస్ సంస్థలు. తోలుకోసం జంతుహింసకు పాల్పడకుండా, మాంసశాలల్లోని చర్మాలతోనే (ఎథికల్లీ సోర్స్డ్ లెదర్) బ్యాగుల్ని తయారుచేస్తుంది స్టెమ్ సంస్థ. ‘రోజానా ఈవెనింగ్ బ్యాగ్’ పేరిట ఇటీవల ఓ కొత్త ఉత్పత్తిని విడుదల చేసిందీ సంస్థ. దారాలతో నేసినట్టుగా బ్యాగు మీద గీతలు కనిపించేలా నిండు రంగుల్లో వీటిని తయారు చేస్తున్నారు. మన ఇష్టాన్ని బట్టి సైజును మార్చుకోవచ్చు. వృథా అరికట్టాలన్న ఉద్దేశంతో మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే వీటిని తయారుచేస్తారు. ikkivi.com లో దొరికే దీని వెల రూ. 13,300.
మన చెప్పులు, దుస్తుల తయారీకి అనేక ముడి పదార్థాలు కావాలి. ఇందుకు, వాడి పడేసిన వస్తువులను ఉపయోగిస్తే భూమిని కాపాడిన వాళ్లం అవుతాం. ఆ పనే చేస్తున్నది రిడన్ సంస్థ. ఇది వృథా వస్తువులతో బట్టలు, పాదరక్షలు తయారు చేస్తున్నది. ఇటీవల ‘షోల్ క్లాగ్ శాండిల్స్’ పేరిట కొత్త మాడల్ చెప్పులను మార్కెట్లోకి తెచ్చింది. పునర్వినియోగ లెదర్, బీచ్వుడ్ మిశ్రమంగా క్లాగ్ డిజైన్‌తో
విభిన్న రంగుల్లో వీటిని రూపొందించారు. shopredone.comలో లభిస్తుంది. ధర రూ. 24,100 మాత్రమే.
“Naya Mall | బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్‌కు ఈ డివైజ్ పెట్టుకుంటే బోలెడన్నీ లాభాలంట!!”
“Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్”
“Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది”