Naya Mall | బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్‌కు ఈ డివైజ్ పెట్టుకుంటే బోలెడన్నీ లాభాలంట!!
Naya mall | బైక్‌పై వెళ్తున్నప్పుడు పెట్రోలు ఎంత ముఖ్యమో హెల్మెట్ కూడా అంతే ముఖ్యం. అందుకే సాధారణ బైకర్ల నుంచి రేసర్ల వరకూ ఈ శిరోభూషణాన్ని తప్పక ధరిస్తారు. ఇక, బైక్ ట్రిప్పులకు వెళ్లినప్పటి సంగతి చెప్పనే అక్కర్లేదు. అలాంటి సందర్భాల్లో రక్షణ కవచమైన హెల్మెట్‌ను ధరించే.. మనతోపాటు విహారయాత్రలో ఉన్న స్నేహితులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాయి టీవీఎస్ ఎస్10ఎక్స్, ఎస్20ఎక్స్ హెల్మెట్ కమ్యూనికేటర్లు.
Naya Mall | రయ్రయ్ కలిసి సాగవోయ్!
బైక్‌పై వెళ్తున్నప్పుడు పెట్రోలు ఎంత ముఖ్యమో హెల్మెట్ కూడా అంతే ముఖ్యం. అందుకే సాధారణ బైకర్ల నుంచి రేసర్ల వరకూ ఈ శిరోభూషణాన్ని తప్పక ధరిస్తారు. ఇక, బైక్ ట్రిప్పులకు వెళ్లినప్పటి సంగతి చెప్పనే అక్కర్లేదు. అలాంటి సందర్భాల్లో రక్షణ కవచమైన హెల్మెట్‌ను ధరించే.. మనతోపాటు విహారయాత్రలో ఉన్న స్నేహితులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తాయి టీవీఎస్ ఎస్10ఎక్స్, ఎస్20ఎక్స్ హెల్మెట్ కమ్యూనికేటర్లు. ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ టీవీఎస్ రూపొందించిన ఈ పరికరాన్ని హెల్మెట్‌కి పెట్టుకుంటే, అది బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి కనెక్ట్ అవుతుంది. దీని సాయంతో కాల్స్ మాట్లాడొచ్చు, పాటలు వినొచ్చు. దీనిలోని ఇంటర్‌కామ్ ద్వారా రెండు పరికరాల మధ్య ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న సుమారు 20 మందితో అనుసంధానమై ఉండొచ్చు. మ్యాప్స్‌ను కూడా వాడుకోవచ్చు. బృందంలో వెళుతున్నప్పుడు మరింత ఎక్కువ ఉపయోగపడే ఈ పరికరాల ధరలు రూ.8,499, రూ.10,999గా ఉన్నాయి. tvsmotor.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పాటా నాదీ.. డ్యాన్సూ నాదే
నచ్చిన చోటికి తీసుకువెళ్లి కావాలనుకున్న పాటను వినేందుకు ఉపయోగపడుతున్న పోర్టబుల్ స్పీకర్లు మరిన్ని హంగులద్దుకుంటున్నాయి. ప్రొమేట్ గ్లిట్-ఎల్ ఈ తరహా కొత్త అడుగు వేసింది. 360 డిగ్రీలలోనూ పాటను వినిపించగలిగేలా గుండ్రటి ఆకృతిలో రూపొందిన దీనిలో లైట్లు కూడా ఉంటాయి. పాటలోని బీట్‌కు అనుగుణంగా నృత్యం చేస్తూ గదిని మ్యూజిక్ లైట్షోకు వేదిక చేస్తుంది. బ్లూటూత్ ద్వారా ఇష్టమైన పాటను ప్లే చేసుకోవచ్చు. ఇంకా బిగ్గరగా వినాలనుకుంటే మరో స్పీకర్‌కి దీన్ని అనుసంధానం చేసే వెసులుబాటూ ఉంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే ఆరు గంటల పాటు పనిచేసే ఇది ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. మూడువేల రూపాయల దాకా వెలపలికే దీన్ని promate.net ద్వారా కొనుగోలు చేయవచ్చు.

పిల్లల పియానో
పియానో వాయించడాన్ని చాలా మంది ఇష్టపడతారు. నిలబడి అటు నుంచు ఇటు, ఇటు నుంచి అటూ కదులుతూ మీటల్ని మీటుతూ పెద్ద సంగీత విద్వాంసుల్లా ఫీలయి
పోతుంటారు. అందుకే పిల్లల వస్తువుల్లో ఒక్క పియానో అయినా వచ్చి చేరుతుంది. వాళ్ల కోసమే క్యాషియోటోన్ సంస్థ మిని ఎస్ఎ-50ని తీసుకొచ్చింది. తేలికగా, చిన్నదిగా ఉండే దీనిలో 32 బటన్లు ఉంటాయి. రకరకాల వాద్య పరికరాలకు సంబంధించి 100 టోన్లు ముందే అప్లోడ్ చేసి ఉంటాయి. చిన్నచిన్న రైమ్‌లు కూడా పాడుతుంది. బ్యాటరీతోనూ, కరెంటుతోనూ నడుస్తుంది. casio.com లో కొనుక్కోవచ్చు. ధర సుమారు అయిదు వేల రూపాయలు.

మొబైల్ జిమ్
సైకిల్ తొక్కుతున్నట్టుగా, మెట్లు ఎక్కుతున్నట్టుగా వ్యాయామం చేసేందుకు ఉపయోగించే ఎలిప్టికల్ మెషీన్ మనకు సుపరిచితమే. ఎక్కడికైనా తీసుకుపోయేందుకు వీలుగా దాన్ని పోర్టబుల్ సైజులో రూపొందించింది పెర్లే కేర్ సంస్థ. సాధారణ మెషీన్‌తో పోలిస్తే.. చాలా తక్కువ స్థలంలో ఇమిడిపోతుంది. వ్యాయామానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించలేకపోయినప్పుడు కూర్చొని పని చేసుకుంటూనే కాళ్లతో వ్యాయామం చేయగలిగేలా ఉపయోగపడుతుంది. దీనిలోని ఎల్సీడీ స్క్రీన్ మీద ఎక్సర్సైజుకి సంబంధించిన లెక్క కనిపిస్తుంది. సైజు చిన్నదిగా ఉండటం వల్ల బాల్కనీ, హాలు, లివింగ్ రూమ్… ఇలా ఎక్కడయినా పెట్టుకునే వీలుంటుంది. అమెజాన్‌లో దొరికే దీని ధర 43వేల రూపాయల పై చిలుకు.
Read More :
“Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్”
“Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

