Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి
Naya Mall | డెనిమ్ జాకెట్లు ఫ్యాషన్‌ను ఇష్టపడే వాళ్లకు హాట్ ఫేవరెట్లు. సాధారణంగా జీన్సు రంగుల్లో కాస్త పొట్టిగా ఉండే వీటిలో మరిన్ని డిజైన్లు వస్తున్నాయి. సాదా డెనిమ్ జాకెట్లకు పూల డిజైన్లను చేర్చి ప్యాచ్ వర్క్ జత చేస్తున్నారు
Naya Mall | లేజర్ జాకెట్
డెనిమ్ జాకెట్లు ఫ్యాషన్‌ను ఇష్టపడే వాళ్లకు హాట్ ఫేవరెట్లు. సాధారణంగా జీన్సు రంగుల్లో కాస్త పొట్టిగా ఉండే వీటిలో మరిన్ని డిజైన్లు వస్తున్నాయి. సాదా డెనిమ్ జాకెట్లకు పూల డిజైన్లను చేర్చి ప్యాచ్ వర్క్ జత చేస్తున్నారు. ఈ తరహాలో మరింత ఫ్యాషనబుల్‌గా కనిపించేలా లేజర్ ప్రింట్ చేసిన జాకెట్‌కు రెండువైపులా జేబులను చేర్చింది నేటివ్ యూత్ సంస్థ. జీన్స్ మీదికి కాస్త కొత్త లుక్ కావాలంటే
ఇలాంటివి ప్రయత్నించవచ్చు. ధర రూ.8000. Nordstorm.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
డ్రెస్ అదుర్స్
జీన్స్ ప్యాంట్లు ఎంత ఫేమసో డెనిమ్ డ్రెస్సులూ అంతే పాపులర్. యువతను ఎంతగానో ఆకట్టుకునే ఈ వస్త్రంతో రకరకాల ఫ్యాషనబుల్ డ్రెస్‌లు, టాప్‌లు తయారు చేస్తుంటారు డిజైనర్లు. ఇక, ఇటీవల బై శ్వేత కపూర్ బ్రాండ్ నుంచి ‘డార్క్ బ్లూ అండ్ టాన్ డెనిమ్ డ్రెస్’ వచ్చింది. వీ నెక్‌తో చిన్న కుచ్చులు ఉండేలా మోకాళ్ల పై వరకూ ఈ డెనిమ్ డ్రెస్‌ను రూపొందించారు. భుజాల మీద లెదర్లా ఉండే ప్రత్యేక వస్త్రంతో కోట్ జత చేశారు. క్యాజువల్ లుక్‌లో ఉండే ఇది ప్రయాణాలకూ హాయిగా ఉంటుందని చెబుతున్నదీ సంస్థ. perniaspopupshop.com లో ఆర్డర్ చేసుకోవచ్చు. ధర రూ. 17,500.
క్రిస్టల్ జోడీ
డెనిమ్ ఇప్పుడు దుస్తుల్ని దాటి యాక్సెసరీస్నూ చేరింది. హ్యాండ్ బ్యాగులు, చెప్పులు, బూట్లలాంటివీ తయారవుతున్నాయి. ట్రెండీగా కనిపించాలంటే డెనిమ్ ఉండాల్సిందే అన్నట్టు ఉంది పరిస్థితి. అందుకే రొమేనియన్ డిజైనర్ అమీనా మౌద్ది ఇటీవల ఇటాలియన్ యాసిడ్ వాష్డ్ డెనిమ్‌తో రూపొందించిన డెనిమ్ చెప్పులను పరిచయం చేశారు. ‘రోజీ క్రిస్టల్- ఎంబెలిష్డ్ డెనిమ్ స్లింగ్ బ్యాక్ పంప్స్’ పేరిట రూపొందించిన ఈ చెప్పులు చూడగానే అల్ట్రా మాడల్ అన్నపదానికి అడ్రస్‌లా కనిపిస్తాయి. దాని మీద తెలుపు రంగు క్రిస్టళ్లను పొదిగిన వింత ఆకృతి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నది. 97 వేల రూపాయల ఖరీదు చేసే ఈ హీల్స్‌ని Net-a-porter.com లో అమ్ముతున్నారు.
గీతలున్నా నాదే
మైఖేల్ జాక్సన్ మూన్ డాన్స్ తెలియని వాళ్లంటూ ఉంటారేమో కానీ యూత్ ఫేవరెట్ డెనిమ్ జీన్సు తెలియనివారు అరుదు. జీన్స్ ప్యాంట్లు అంతగా జనంలోకి చొచ్చుకుపోయాయన్నమాట ముమ్మాటికీ నిజం. అందుకే షేడెడ్ జీన్సు, టోర్న్డ్ జీన్సు అంటూ అందులో బోలెడు రకాలు వస్తున్నాయి. జనానికి నచ్చుతున్నాయి. ఇక, అందులోనే మరో రకం ‘స్ట్రోక్స్ డెనిమ్’. కాన్వాసు మీద కుంచెతో గీసినట్టుగా రంగుల గీతలుంటాయి ఈ ప్యాంటు మీద. లేత గులాబీ, తెలుపు, నీలం రంగుల గీతలతో చూడగానే విభిన్నంగా కనిపించే ఈ జీన్సును అబ్కాసా సంస్థ రూపొందించింది. ఆల్టరేషన్ చేయించుకున్నా డిజైన్ దెబ్బతినకుండా ఉండేలా ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. abkasa.comలో లభిస్తుంది ఇది. ధర రూ.9,950.
Read More :
“Naya Mall | ఈ సీసీ కెమెరాలకు కరెంట్, డీవీఆర్ ఏదీ అక్కర్లేదు”
Naya Mall | బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్‌కు ఈ డివైజ్ పెట్టుకుంటే బోలెడన్నీ లాభాలంట!!
“Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్”
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

