Naya Mall | ఈ సీసీ కెమెరాలకు కరెంట్, డీవీఆర్ ఏదీ అక్కర్లేదు
Naya Mall | ఎండాకాలమే కాదు, ఉక్కపోతగా ఉంటే వానాకాలమూ ఏసీలు అవసరం అవుతాయి. కాకపోతే, అందులోంచి నీళ్లు కారుతుండటం కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. ఈ ఇబ్బందికి పరిష్కారంగా గోద్రెజ్ సంస్థ లీక్ప్రూఫ్ ఏసీని మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Naya Mall |సీసీ.. ఎండతో ఖుషీ!
సీసీ కెమెరాలు అత్యవసరం అయిపోయాయి. భద్రత కోసం ప్రతి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతున్నది. అందుకే వాటి డిజైన్, ఫీచర్స్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. ‘యూఫీ ఎస్220 సోలోక్యామ్’ వీటిలో ఒక ప్రత్యేక రకం. దీనికి విద్యుత్ సరఫరా అవసరం లేదు. బ్యాటరీ మార్చే పనీ లేదు. సూర్యరశ్మితో చార్జ్ అవుతూ.. నాణ్యమైన వీడియోలు తీస్తుంది. పగలూ రాత్రీ కూడా చిత్రాలు బాగా కనిపించేలా రికార్డు చేయగలదు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషుల్ని గుర్తిస్తుంది. అన్ని వాతావరణాల్లోనూ పనిచేయగలదు. 8 జీబీ స్టోరేజ్ స్పేస్ ఉంది. కాబట్టి డాటా సేవ్ చేసుకోవడానికి వేరే పరికరాల అవసరం ఉండదు. దీన్ని uk.eufy.com లో అమ్ముతున్నారు. ఖరీదు రూ.11,300.

ఏసీ లీకవ్వదిక!
ఎండాకాలమే కాదు, ఉక్కపోతగా ఉంటే వానాకాలమూ ఏసీలు అవసరం అవుతాయి. కాకపోతే, అందులోంచి నీళ్లు కారుతుండటం కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. ఈ ఇబ్బందికి పరిష్కారంగా గోద్రెజ్ సంస్థ లీక్ప్రూఫ్ ఏసీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనిలోని యాంటిలీక్ టెక్నాలజీ కారణంగా ఏసీ వాడుతున్న సమయంలో నీళ్లుకారవు. ఇన్వర్టర్ కంప్రెసర్ పదేండ్ల వారెంటీతో వచ్చే దీని ధర రూ. 48,900. అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయివి.

పిల్లల చెవులు భద్రం!
స్మార్ట్‌యుగం వల్ల ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లూ, ట్యాబ్లూ పిల్లలకు అవసరం అవుతున్నాయి. ఆన్లైన్ క్లాసులు వినేందుకు, అవసరమైన ప్రాజెక్టు వర్కులు చేసేందుకు హెడ్సెట్లు తప్పనిసరి. అందుకే బెల్కిన్ సంస్థ ‘బెల్కిన్ సౌండ్ఫామ్ మినీ’ పేరిట పిల్లల కోసం ప్రత్యేకంగా హెడ్సెట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇవి గరిష్ఠంగా 85 డెసిబల్స్ ధ్వనిని మాత్రమే ప్రసారం చేస్తాయి. దీంతో పిల్లల చెవులు అతిధ్వనుల నుంచి భద్రంగా ఉంటాయి. పెద్ద, చిన్న పిల్లలు వాడగలిగేలా అడ్జస్టబుల్ హెడ్ బ్యాండ్‌తో, చెవుల దగ్గర మెత్తటి కుషన్‌తో రూపొందుతున్నాయివి. ఒకసారి చార్జింగ్ పెడితే 30 గంటలు పనిచేస్తాయి. అంతేకాదు, మరింత సులభంగా వాడుకోవాలి అనుకుంటే వైర్‌తో కనెక్ట్ చేసుకునే వెసులుబాటూ ఉంది. వివరాలకు belkin.com. ధర రూ.3,999.

బ్యాగు పోయే ముచ్చటే లేదు
హడావుడిలోనో, ఆదమరిచో… ఒక్కోసారి ఎక్కడో బ్యాగు పోగొట్టుకుంటూ ఉంటాం. వాటిలో విలువైన సామాన్లు ఉండొచ్చు. బ్యాక్‌ప్యాక్ లాంటివైతే ల్యాప్‌టాప్‌లాంటి ముఖ్యమైన వస్తువులూ ఉంటాయి. ఒక్కసారి పోయాయంటే మన తిప్పలు చెప్పనక్కర్లేదు. అందుకే, బ్యాగు ఎక్కడున్నా ఇట్టే తెలుసుకోగలిగేలా, లొకేషన్ ఆప్షన్ ఉన్న బ్యాక్‌ప్యాక్ మార్కెట్లోకి వచ్చింది. ‘టార్గస్ సైప్రెస్ హీరో’ పేరిట వచ్చిన ఈ బ్యాగు లోపల బ్లూటూత్ సాయంతో పనిచేసే లొకేషన్ డివైజ్ ఉంటుంది. ఇది ఐఫోన్, ఐపాడ్లకు అనుసంధానమై పనిచేస్తుంది. కాబట్టి బ్యాగు ఎవరైనా ఎత్తుకెళ్లినా, మిస్ అయినా ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు, దీన్ని పాత ప్లాస్టిక్ బాటిళ్లనూ, పునర్వినియోగానికి అనువయ్యే పదార్థాలను ఉపయోగించి తయారు చేశారు. పర్యావరణ హితమన్న మాట. us.targus.comలో ఆర్డర్ చేసుకోవచ్చు. ధర కేవలం రూ. 12,400.
Read More :
Naya Mall | బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్‌కు ఈ డివైజ్ పెట్టుకుంటే బోలెడన్నీ లాభాలంట!!
“Naya Mall | సన్ గ్లాసెస్ విత్ ఉడెన్ టచ్.. అదిరిపోయిన లేటెస్ట్ గ్యాడ్జెట్”
“Naya Mall |ఈ స్మార్ట్ రింగ్ మీ హార్ట్ రేట్ కూడా చెప్పేస్తుంది”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

