Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
Naya Mall | గిలిగింతలు పెట్టే చిరుజల్లుల్లో తిరగడం చాలా మందికి ఇష్టం. అందుకే ఈ సీజన్లో ఏరికోరి ట్రిప్‌లకు వెళతారు. జలపాతాల సందిట్లో, ట్రెకింగ్ సందట్లో ఫొటోలు దిగేందుకూ సరదా పడతారు. కానీ ఉన్నట్టుండి వాన పడితే ఎలా? ఫోన్ల్లు, డిజిటల్ కెమెరాలూ తడిస్తే కష్టమే. ఆ క్షణాలను కూడా మిస్ అవకుండా, ఎంచక్కా వానలోనూ ఫొటోలు తీసుకునేందుకు వీలు కల్పించేలా వాటర్ ప్రూఫ్ కెమెరాలు వస్తున్నాయి.
Naya Mall | వానల్లో ఫొటోలు..
గిలిగింతలు పెట్టే చిరుజల్లుల్లో తిరగడం చాలా మందికి ఇష్టం. అందుకే ఈ సీజన్లో ఏరికోరి ట్రిప్‌లకు వెళతారు. జలపాతాల సందిట్లో, ట్రెకింగ్ సందట్లో ఫొటోలు దిగేందుకూ సరదా పడతారు. కానీ ఉన్నట్టుండి వాన పడితే ఎలా? ఫోన్ల్లు, డిజిటల్ కెమెరాలూ తడిస్తే కష్టమే. ఆ క్షణాలను కూడా మిస్ అవకుండా, ఎంచక్కా వానలోనూ ఫొటోలు తీసుకునేందుకు వీలు కల్పించేలా వాటర్ ప్రూఫ్ కెమెరాలు వస్తున్నాయి. ఇటీవల ఒలింపస్ సంస్థ ‘టఫ్ టీజీ – 6’ పేరిట నీళ్లలో తడిసినా సరే స్పష్టమైన చిత్రాలు తీయగల కెమెరాను తయారుచేసింది. వానపడ్డప్పుడే కాదు సముద్రాలు, నదులు, స్విమ్మింగ్ పూల్స్లాంటి చోట్ల పూర్తిగా నీళ్లలో మునిగి కూడా దీంతో చక్కగా ఫొటోలు తీసుకోవచ్చు. పేరుకు తగ్గట్టే ఇది టఫ్.. మంచులోనూ, దుమ్ములోనూ కూడా 4K రిజల్యూషన్‌తో చిత్రించగలదు. ధర రూ. 44 వేలు. అమెజాన్‌లో లభిస్తుంది.

ప్రకృతి సంచిక!
ఖరీదైన హ్యాండ్‌బ్యాగులు అంతకంటే ఖరీదుగా కనిపిస్తే కిక్కేం ఉంటుంది? ఇంట్లో అల్లినట్టుగానో, హస్తకళల షాపులో కొన్నట్టుగానో అనిపిస్తేనే మజా.. అన్నది లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ప్రాడ ఉద్దేశమేమో అనిపిస్తుంది ఈ చేతిసంచిని చూస్తే. చాలా సింపుల్‌గా ఉన్న ఈ బ్యాగు ఖరీదు అక్షరాలా లక్షా తొంభై వేల పైచిలుకు మరి! ఈ ‘రాఫియా టొటె బ్యాగ్’ను ప్రత్యేకమైన నారతో అల్లారు. పైన ప్రాడ బ్రాండ్ పేరు ఎంబ్రాయిడరీ చేశారు. రాఫియా పామ్ చెట్టు ఆకుల నుంచి తీసిన నారను ‘రాఫియా’ అని పిలుస్తారు. ఆగ్నేయ ఆసియా, తూర్పు, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని మడగాస్కర్ దీవుల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఈ నారకు రంగులు వేసి బ్యాగులు అల్లుతున్నారు. నీలం, గులాబీ, ఊదా, గోధుమ.. ఇలా విభిన్నమైన వన్నెల సంచులను farfetch.com ద్వారా విక్రయిస్తున్నారు.

టీపాయ్ అల్లిక..
గది మధ్యలో టీపాయ్ ఉంటేనే అందం, సౌకర్యం కూడా. చుట్టూ ఎంత ఫర్నిచర్ ఉన్నా సెంటర్ ఆఫ్ రూమ్ మాత్రం టీపాయే! దాని చుట్టూ చేరితేనే కంఫర్టబుల్‌గా కూర్చున్నామని అనిపిస్తుంది. చేతిలోని కాఫీ కప్పునో, న్యూస్పేపర్నో పెడుతూ తీస్తూ బయటి వాతావరణాన్ని ఆస్వాదిస్తుంటాం. అలాంటి టీపాయ్ అందమైన అల్లికతో వస్తే మరింత ముచ్చటగా ఉంటుంది. అదే కోవకు చెందుతుంది ‘టర్నర్ రాటాన్ కాఫీ టేబుల్’. రాటాన్ చెట్టు తీగతో అల్లిన పైభాగం, ఇనుప కాళ్లు, మ్యాంగో ఉడ్గా పిలిచే ప్రత్యేక రకం చెక్క ఫ్రేముతో దీన్ని రూపొందించారు. సహజత్వాన్ని ఇష్టపడే వాళ్లకు ఈ టేబుల్ నచ్చుతుంది. తీగతో అల్లింది కాబట్టి వేడివేడి వస్తువులు పెట్టేప్పుడు కోస్టర్ లాంటిది వాడాల్సి రావచ్చు. ఏమైనా చిందితే వెంటనే తుడవాల్సిందే. ధర రూ. 16 వేలు. fleck.co.in లో దొరుకుతుంది.

Tea Cup
కాఫీ.. ముగ్గేసి..
ముంగిట్లో ముగ్గు ఎంత ముచ్చటగా ఉంటుందో, దాన్ని చూస్తూ కాఫీ తాగడమూ అంతే ఆనందాన్నిస్తుంది. అయితే ఆ ముగ్గుల అందాన్ని తాగే గ్లాసు మీదికి, ఘుమఘుమలాడే కాఫీని సిద్ధం చేసే ఫిల్టర్ మీదికి మళ్లించారు డిజైనర్లు. ‘హ్యాండ్ పెయింటెడ్ కాఫీ ఫిల్టర్ సెట్’ లేదా ‘కోలం కాఫీ ఫిల్టర్ సెట్’గా దీన్ని పిలుస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రల మీద చేత్తో ముగ్గుల్నీ, రంగుల్నీ వేస్తున్నారు కళాకారులు. హస్త కళలకు ప్రత్యేకమైన trovecraftindia.com వెబ్సైట్ వాళ్లు వీటిని అమ్ముతున్నారు. సెట్ రకాన్ని బట్టి ధరలు రెండూ రెండున్నర వేల రూపాయల మధ్య.
Read More :
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

