Naya Mall | అమ్మాయిలు జీరో సైజ్ కోసం ఆరాటపడ్డట్టే.. హ్యాండ్ బ్యాగులు కూడా ఇలా సైజ్ తగ్గించుకుని వచ్చేస్తున్నాయ్!
Naya Mall | బుజ్జి బ్యాగు! హ్యాండ్ బ్యాగుఅంటే కాస్త పెద్ద సైజులోనే ఊహించుకుంటాం. సైడ్ పిన్నులు, సేఫ్టీ పిన్నులు, బొట్టు బిళ్లలు, కాటుక, లిప్‌స్టిక్, తాళాలు.. ఇలా రోజూ వాడే రకరకాల వస్తువులు ఇందులో ఇమిడిపోవాలి మరి. ముద్దుగుమ్మలు జీరో సైజ్ కోసం ఆరాటపడుతున్నట్టే.. బ్యాగు కూడా తన సైజు తగ్గించుకుంది.
Naya Mall | బుజ్జి బ్యాగు!
హ్యాండ్ బ్యాగుఅంటే కాస్త పెద్ద సైజులోనే ఊహించుకుంటాం. సైడ్ పిన్నులు, సేఫ్టీ పిన్నులు, బొట్టు బిళ్లలు, కాటుక, లిప్‌స్టిక్, తాళాలు.. ఇలా రోజూ వాడే రకరకాల వస్తువులు ఇందులో ఇమిడిపోవాలి మరి. ముద్దుగుమ్మలు జీరో సైజ్ కోసం ఆరాటపడుతున్నట్టే.. బ్యాగు కూడా తన సైజు తగ్గించుకుంది. అంతర్జాతీయ లగ్జరీ యాక్సెసరీస్ తయారీ సంస్థ ‘జిమ్మీ చూ’ సైతం ఈ ట్రెండ్‌లో ఓ భాగమైంది. అందులో భాగంగానే, ఒక రకం క్రిస్మస్ చాక్లెట్‌ను పోలిన ‘బోన్ బోన్ మినియేచర్ బ్యాగ్’ రూపొందించింది. దీన్ని పూర్తిగా లెదర్‌తో తయారు చేశారు. మూసేందుకు, తెరిచేందుకు గొలుసులు ఉండటం ఈ డిజైన్ ప్రత్యేకత. విభిన్న రంగుల్లో దొరికే వీటిని చేతితో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్స్, భుజానికి తగిలించుకునేందుకు గొలుసులు ఉన్నాయి. row.jimmychoo.comలో విక్రయిస్తారు. ధర రూ. 54,000.

శాటిన్ శాండల్
శాటిన్ అందం వస్ర్తాల్లోనే కాదు చెప్పుల్లోనూ తళుకులీనుతున్నది. ముచ్చటైన ముద్దుగుమ్మ పాదాలకు పొందిగ్గా పారాణి రాసినంత అందంగా గులాబీ వన్నెల్లో మెరిసిపోతున్నది. ఫ్రెంచ్ డిజైనర్ క్రిస్టియన్ లాబోటిన్ రూపొందించిన ‘రెడ్ సోల్ రిబ్బన్ యాంకిల్-ర్యాప్ స్టిలెట్లో శాండిల్స్’ చూశాక ఈ మెరుపుల్ని ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. నూరుశాతం లెదర్‌తో ఈ చెప్పులు తయారయ్యాయి. ఇటలీలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యాషన్ శాండిల్స్‌ను మడమ పైన గులాబీ రంగు క్రేప్ శాటిన్ వస్త్రంతో పైన ముడివేసుకునేలా డిజైన్ చేశారు. ఇక, ఈ చెప్పు బయటివైపు, సోల్ భాగంలో ఎరుపు రంగు లెదర్ ఉంటుంది. క్రిస్టియాన్ లుబూటాన్ బ్రాండ్ చెప్పులన్నిటిలో ఇదొక ప్రత్యేకత. neimanmarcus.comలో ఆర్డర్ చేయవచ్చు. ధర రూ. 89 వేలు.

పట్టు కోటు
కుర్తీలు, టాప్ల మీదకి ఫ్యాషనబుల్‌గా వాడే షాట్ జాకెట్‌ను ఇప్పుడు లాంగ్ కోట్లు డామినేట్ చేస్తున్నాయి. డ్రెస్ ఏదైనా లాంగ్ ఓవర్లే వేస్తేనే ట్రెండీగా ఉంటుందనిపించేలా తయారయ్యాయి. ఇక, అందులోనూ పట్టు వస్త్రంతో కోట్ తయారు చేసి రిచ్ లుక్ జోడిస్తున్నది తిత్లీ సంస్థ. ఊదా, గులాబీ వన్నెల కలబోతగా ‘లాంగ్ షాల్ కాలర్ సిల్క్ ఓవర్లే’ను రూపొందించింది. శాలువా తరహా నెక్ డిజైన్ దీని ప్రత్యేకత. క్రష్డ్ మాడల్‌లో ముడతలు ఉండేలా క్రింకిల్డ్ సిల్క్ వస్త్రంతో ఈ ఓవర్లేని తీసుకువచ్చారు. ధర రూ. 19,800. వివరాలకు goodearth.in.

ఊదా రత్నపు ఉంగరం
ఉంగరాల్లో తెల్లరాళ్లు, ఎర్రరాళ్లు, పచ్చరాళ్లు వాడతాం. ఎన్ని నగిషీలు చెక్కినా అలవాటుగా మనం పెట్టుకునే రంగులైతే ఇవే. అయితే అంగుళీకానికీ కొత్త అందాన్ని తీసుకొచ్చేందుకు ఊదా రంగులోని అమెథిస్ట్ రాయిని ఉపయోగించారు డిజైనర్లు. ‘రిబ్బన్ రింగ్’గా పిలిచే ఇందులో వేలి పై భాగానికి రెండు పెద్ద అమెథిస్ట్ రాళ్లు వస్తాయి. చుట్టూ కూడా ఇదే ఉపరత్నపు పలకల రాళ్లు ఉంటాయి. 18 క్యారెట్ల బంగారంతో నాజూగ్గా రూపొందించిన ఈ ఉంగరం డిజైనర్ ఆకాంక్ష సేథి కలెక్షన్ లోనిది. రూ. 1.3 లక్షల దాకా పలుకుతుంది. akankhasethi.comలో కొనుగోలు చేయొచ్చు.
Read More :
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

