TS SSC Results | జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. మే 16 లోగా ఫీజు చెల్లించాలి..
TS SSC Results | రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
TS SSC Results | హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 91.31 శాత్తం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 89.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,91,862 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కొనసాగనుంది. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.
టెన్త్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా 99.05 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. సిద్దిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడు స్థానంలో నిలిచింది. బాలికలు 93.23 శాతం ఉత్తీర్ణత, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదైంది. విద్యార్థులు https://www.ntnews.com, https:// telanganatoday.com వెబ్సైట్లను సంప్రదించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

