Naveen-ul-Haq | మానవ హక్కుల కంటే రెండు పాయింట్లు ముఖ్యమా?.. అప్గన్ పేసర్ షాకింగ్ కామెంట్స్
Naveen-ul-Haq : వన్డే ప్రపంచ కప్‌లో పెద్ద జట్లకు షాకిస్తున్న అఫ్గనిస్థాన్(Afghanistan) కీలక సమరానికి సిద్ధమవుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో నవంబర్ 7న బలమైన ఆస్ట్రేలియాను ఢీ కొనబోతోంది. ముంబైలోని వాంఖడేలో జరిగే ఈ పోరుకు ముందు...
Naveen-ul-Haq : వన్డే ప్రపంచ కప్‌లో పెద్ద జట్లకు షాకిస్తున్న అఫ్గనిస్థాన్(Afghanistan) కీలక సమరానికి సిద్ధమవుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో నవంబర్ 7న బలమైన ఆస్ట్రేలియాను ఢీ కొనబోతోంది. ముంబైలోని వాంఖడేలో జరిగే ఈ పోరుకు ముందు అఫ్గన్ పేసర్ నవీన్ ఉల్ హక్ కంగారూలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా నిరాకరించింది. అయితే.. వరల్డ్ కప్‌లో ఆడడం చాలా ఆసక్తిగా ఉండనుంది’ అనే పోస్టు పెట్టాడు. అందులోనే స్టాండర్స్, మానవ హక్కులు లేదా రెండు పాయింట్లు అనే హాష్‌ట్యాగ్ పక్కనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఎమోజీతో నవీన్ ఆసీస్ తీరును ప్రశ్నించాడు.

ఈ ఏడాది ఆరభంలో అఫ్గనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబాన్లు.. మహిళలు క్రికెట్ ఆడడంపై ఆంక్షలు విధించడానికి నిరసనగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇది మనసులో పెట్టుకున్న నవీన్ ఉల్ హక్ వరల్డ్ కప్‌లో కమిన్స్ సేనపై సత్తా చాటాలనే కసితో ఉన్నాడు.
8 పాయింట్లతో..
భారత గడ్డపై జరుగుతున్న మెగాటోర్నీలో అఫ్గనిస్థాన్ సంచన విజయాలు సాధిస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకను ఓడించి.. 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇంగ్లండ్‌పై ఆరో ఓటమిని అందించిన ఆసీస్.. 10 పాయింట్లతో సెమీస్ బెర్తుకు మరింత చేరువైంది. ఆ మ్యాచ్‌లో కాబూలీలు అద్భుతం చేస్తే.. కంగారూల సెమీస్ ఆశలకు గండి కొట్టినట్టే.
ఇవి కూడా చదవండి
-
The Diary of a CEO | ఈ 14 సూత్రాలు పాటిస్తే మీ లైఫ్‌కి మీరే బాస్ అవ్వొచ్చు!
-
ODI World Cup 2023 | ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు.. నాలుగో బ్యాటర్‌గా పాకిస్థాన్ ఓపెన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

