ODI World Cup 2023 | ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు.. నాలుగో బ్యాటర్‌గా పాకిస్థాన్ ఓపెనర్
ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లో తొలి శతకం బాదిన పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్(Fakhar Zaman) అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్ కప్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. నవంబర్ 4న బెంగళూరులో న్యూజిలాండ్..
ODI World Cup 2023 : వన్డే ప్రపంచ కప్‌లో తొలి శతకం బాదిన పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్(Fakhar Zaman) అరుదైన రికార్డు సాధించాడు. వరల్డ్ కప్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. నవంబర్ 4న బెంగళూరులో న్యూజిలాండ్ బౌలర్లపై 10 సిక్సర్లతో విరుచుకుపడిన జమాన్ అరుదైన క్లబ్లో చోటు సంపాదించాడు.
మిగతా ముగ్గురు ఎవరంటే..? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eion Morgan), వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle), న్యూజిలాండ్ చిచ్చరపిడుగు మార్టిన్ గఫ్టిల్(Martin Guptil). అయితే.. మోర్గాన్ 17 సిక్సర్లతో ఈ జాజితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గేల్ 16 సిక్సర్లతో, గఫ్టిల్ 11 సిక్సర్లతో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.
ఫఖర్ వీరబాదుడు
సెమీఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ సత్తా చాటింది. పరుగుల వరద పారిన పోరులో.. అదృష్టం వరుణుడి రూపంలో తోడవడంతో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన తొలి పోరులో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.
ఫఖర్ జమాన్

ఓపెనర్ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 126 నాటౌట్; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) కివీస్ బౌలర్లతో చెడుగుడు ఆడుకోగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఒడ్డున పడేసిన ఫఖర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఇవి కూడా చదవండి
-
Hyderabad | టికెట్ ఒకరికి ఇస్తే.. నామినేషన్ వేసింది ఇంకొకరు.. రెబల్స్ తీరుతో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి
-
Gunmen | మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

