Gunmen | మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య..
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) గన్‌మెన్ ఏఎస్ఐ ఫాజిల్ (Gunmen Fazil) బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) గన్‌మెన్ ఏఎస్ఐ ఫజల్ అలీ (Gunmen Fazal Ali) బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్వీస్ తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఓ హోటల్లో ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని మంత్రి సబిత, వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. అయితే ఆదివారం ఉదయం కుమార్తెతో మాట్లాడిన ఫజల్.. ఆమె ఎదుటే ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
కాగా, ఏఎస్ఐ ఫజల్ అలీ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తున్నదని డీసీపీ జోయల్ డేవిస్ అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఇన్చార్జ్గా ఉన్నారని చెప్పారు. ఆదివారం ఉదయం 6 గంటలకు తన కూతురుతో కలిసి విధులకు హాజరయ్యారని, 7 గంటల సమయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. హోటల్ దగ్గర వ్యక్తిగత విషయాల గురించి కుమార్తెతో చర్చించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిశామని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

