Delhi | ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై నగరాలు టాప్ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ (Swiss Group IQAir) నివేదికను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ (Delhi) అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై నగరాలు టాప్ 5లో ఉన్నాయి. ఈమేరకు స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ (Swiss Group IQAir) నివేదికను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483గా ఉంది. దీంతో ఐక్యూ ఎయిర్ జాబితాలో ఢిల్లీ మొదటి ప్లేస్‌లో ఉంది. ఇక 371 పాయింట్లతో పాకిస్థాన్‌లోని లాహోర్ రెండో స్థానంలో ఉండగా, కోల్‌కతా (206), బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్‌లోని కరాచీ (162) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ (159), హాంగ్జౌ (159), కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152) టాప్ టెన్‌లో నిలిచాయి.
తక్కువ ఉష్ణోగ్రతలు, గాలి సరిగా లేకపోవడంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పొలాల్లోని పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీలో గాలి కలుషితం అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత ఏక్యూఐ 550కి చేరుకోవడంతో 2 కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు.

ఏక్యూఐ 0-50గా ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టు భావిస్తారు. కానీ, ఢిల్లీలో ఏ సమయంలో చూసినప్పటికీ 400-500గా ఉండడంతో.. ఈ గాలిని పీల్లచడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ-రాజధాని ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- air quality
- AQI
- Delhi
- Kolkata
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

