నీలగిరి, ఆగస్టు 08 : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ పట్టణంలోని 36 డివిజన్ పరిధిలో వివేకానందనగర్, యాటకన్నారెడ్డి కాలనీ, కామేశ్వర్రావు కాలనీల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించి బాలింతలు, గర్భిణీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం చిన్నారుల వయస్సు బరువు, ఎత్తు కొలతలను పరిశీలించారు. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించి బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించాలని అంగన్వాడీ టీచర్లు పుష్పమ్మ, విజయలక్ష్మి, సుశీల సూచించారు. 6 నెలలు నిండిన తర్వాత ఆదనపు ఆహారం అందిస్తూ 2 సంవత్సరాల వరకు తల్లి పాలు పట్టించాలన్నారు. చిన్నారులకు పోషక ఆహారాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయాలు ధనమ్మ, యశోద, రాణీ, ఆశ వర్కర్ సుధారాణీ, చిన్నారుల తల్లులు అనూష, రేణుక, మౌనిక పాల్గొన్నారు.