Health Tips | తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు పడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Health Tips | నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల (Health Issues) లో కాళ్లు, చేతులు తిమ్మిర్లు (Cramps) పట్టడం కూడా ఒకటిగా మారిపోయింది. కొంతమందిలో కాసేపు కూర్చొని లేచినా తిమ్మిర్లు ఇబ్బంది పెడుతాయి. రాత్రి నిద్రలో కూడా హఠాత్తుగా కాళ్లు, చేతులు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంటాయి. ఇలా తిమ్మిర్లు రావడమనేది సాధారణంగా రక్త ప్రసరణ (Blood Cerculation) సరిగ్గా జరగకపోవడం వల్ల జరుగుతుంది.
Health Tips : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల (Health Issues) లో కాళ్లు, చేతులు తిమ్మిర్లు (Cramps) పట్టడం కూడా ఒకటిగా మారిపోయింది. కొంతమందిలో కాసేపు కూర్చొని లేచినా తిమ్మిర్లు ఇబ్బంది పెడుతాయి. రాత్రి నిద్రలో కూడా హఠాత్తుగా కాళ్లు, చేతులు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంటాయి. ఇలా తిమ్మిర్లు రావడమనేది సాధారణంగా రక్త ప్రసరణ (Blood Cerculation) సరిగ్గా జరగకపోవడం వల్ల జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నరాలపై ఒత్తిడి పడటం వల్ల కూడా ఇలా అవుతుంది. అయితే కొన్ని చిట్కాలు (Tips) పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తిమ్మిర్ల కారణాలు
నరాలపై ఒత్తిడి
ఒకే స్థితిలో ఎక్కువ సేపు కూర్చోవడం లేదా పడుకోవడంవల్ల నరాలపై ఒత్తిడి పడి మెదడుకు చేరే సంకేతాలు తాత్కాలికంగా ఆగిపోతాయి. దీనివల్ల ఆ భాగం మొద్దుబారుతుంది.
పోషకాహార లోపం
శరీరంలోని నరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి విటమిన్ B12, B6, మెగ్నీషియం ఎంతో అవసరం. వీటి లోపం ఏర్పడినప్పుడు నరాలు బలహీనపడి తిమ్మిర్లు వస్తుంటాయి.
మధుమేహం
రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాలంపాటు అదుపులో లేకపోతే అది నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనిని ‘డయాబెటిక్ న్యూరోపతి’ అంటారు.
రక్త ప్రసరణ సమస్యలు
శరీరంలోని చివరి భాగాల (చేతి వేళ్లు, కాలి వేళ్లు) కు రక్త సరఫరా సరిగ్గా జరగనప్పుడు కూడా తిమ్మిర్లు రావచ్చు.
వెన్నెముక సమస్యలు
మెడ లేదా నడుము భాగంలో వెన్నుపూసల మధ్య నరాలు నొక్కుకుపోయినప్పుడు, ఆ నరం ప్రవహించే చెయ్యి లేదా కాలికి తరచూ తిమ్మిర్లు పడుతుంటాయి.
నివారణకు చిట్కాలు
వ్యాయామం
రోజూ కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చేయడంవల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా స్ట్రెచింగ్ వ్యాయామాలు తిమ్మిర్లను తగ్గిస్తాయి.
పోషకాహారం
రాగిజావలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, నరాలకు శక్తినిస్తాయి. అరటిపండు (పొటాషియం కోసం), ఖర్జూరం, ఆకుకూరలు తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగడం
రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. ఇది కండరాలు, నరాలు సాఫీగా పనిచేయడానికి సహాయపడుతుంది.
గోరువెచ్చని నూనెతో మర్దన
తిమ్మిర్లు వచ్చేచోట గోరువెచ్చటి కొబ్బరి నూనె లేదా ఆవనూనెతో సున్నితంగా మర్దన చేయడంవల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.
సరైన భంగిమ
కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు నరాలపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న విరామం తీసుకుని అటూఇటూ నడవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

