శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 17:29:55

ICC Test rankings: అగ్ర‌స్థానంలోనే విరాట్‌ కోహ్లీ

ICC Test rankings: అగ్ర‌స్థానంలోనే విరాట్‌ కోహ్లీ

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

దుబాయ్‌:  సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రన్‌మెషీన్‌ విరాట్‌ 928 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.  ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ 911 పాయింట్లతో రెండు.. ఆసీస్‌ సంచలనం మార్నస్‌ లబుషేన్‌ 827 పాయింట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.  రెండో స్థానంలో ఉన్న స్మిత్‌ కన్నా 17 పాయింట్ల ఆధిక్యంలో కోహ్లీ ఉన్నాడు. చాలా రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఈ వ్యత్యాసం కొనసాగుతూనే ఉంది.  భారత్‌ నుంచి టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా(791పాయింట్లు) ఆరో ర్యాంకులో ఉండగా.. ఆజింక్య రహానె(759) ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు. 

టెస్టు బౌలర్ల జాబితాలో భారత స్టార్‌ బౌలర్‌ బుమ్రా ఆరోస్థానంలో ఉన్నాడు. టీమ్‌ఇండియా నుంచి  అశ్విన్‌ ఎనిమిది, మహ్మద్‌ షమీ పదో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ 904 పాయింట్లతో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో బెన్‌స్టోక్స్‌ రెండో ర్యాంకుకు దూసుకొచ్చాడు.  విండీస్‌  ఆటగాడు  జేసన్‌ హోల్డర్‌ నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. 


logo