IPL 2025 : ‘బ్రహ్మయ్యకు అర్థం కాని తలరాతలు కుర్రాళ్లు.. బ్రహ్మాండం బద్ధలు కొట్టే అణుబాంబులు కుర్రాళ్లు’ అని అన్నాడో సినీకవి. అతడు చెప్పినట్టే ఈకాలం కుర్రాళ్లు ఏరంగంలోనే ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విషయానికొస్తే ఐపీఎల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో వీరంగం సృష్టిస్తున్నారు. వరల్డ్ క్లాస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. సిక్సర్లు, ఫోర్లతో మెరుపు శతకాలు బాదేస్తున్నారు.
సోమవారం జైపూర్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సునామీలా విరుచుకపడి రికార్డు సెంచరీ కొట్టేశాడు. కేవలం 35 బంతుల్లోనే ఈ చిచ్చరపిడుగు వందతో గర్జించాడు. దాంతో, ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 18వ ఎడిషన్‌లో మూడంకెల స్కోర్ సాధించిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడీ కుర్రాడు.
A NEW STAR IS BORN 🌟
Vaibhav Suryavanshi announces himself to the world!pic.twitter.com/JJ382EdC3r
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2025
ఈసారి ఐపీఎల్లో విశేషం ఏంటంటే.. నలుగురు శతక వీరులు భారత్‌కు చెందినవాళ్లే. వీళ్లలో కామన్ పాయింట్ ఏంటంటే.. వీళ్లందరి వయసు 27 ఏళ్ల లోపే. పైగా ఈ యంగ్‌స్టర్స్ 220 ప్లస్ స్ట్రయిక్ రేటుతో సెంచరీ కొట్టారు. వయసురీత్యా వీళ్లలో 14 ఏళ్ల వైభవ్ అందరికంటే చిన్నవాడు. అభిషేక్ శర్మ(Abishek Sharma), ప్రియాన్ష్ ఆర్య(Priyansh Arya)లకు 24 ఏళ్లు మాత్రమే. ఇషాన్ కిషన్(Ishan Kishan)కు 26 ఏళ్లు.
All the IPL 2025 hundreds:
◾ All Indians
◾ All below 27
◾ All left-handers
◾ All hundreds with 220+ SR
◾ Two playing their first IPL pic.twitter.com/UbQ2e3elLI— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ తొలి సెంచరీతో చెలరేగాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఈ యువకెరటం రఫ్ఫాడించాడు. తన విధ్వంసక బ్యాటింగ్‌తో ఐపీఎల్లో కెరీయర్లో మొదటిసారి మూడంకెల స్కోర్ సాధించాడు. 225.53 స్ట్రయిక్ రేటుతో ఆడిన ఇషాన్ 42 బంతుల్లో 103 రన్స్ చేశాడు.
Saving this to our ‘Special Moments’ folder 📂 😌
A knock of the highest caliber from Priyansh Arya as he scores 1️⃣0️⃣3️⃣(42) 💥
Updates ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @PunjabKingsIPL pic.twitter.com/BsPfEoKhiB
— IndianPremierLeague (@IPL) April 8, 2025
ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ సీజన్లో రెండో సెంచరీ వీరుడు ప్రియాన్ష్ ఆర్య. ఈ పంజాబ్ కింగ్స్ ఓపెనర్ మెరుపు బ్యాటింగ్‌తో వంద బాదేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ఉతికారేసిన ప్రియాన్ష్.. 245.23 స్ట్రయిక్ రేటుతో ఆడి 7 ఫోర్లు, 9 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్లో విధ్వంసక ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ(Abhishek Sharma) 18వ ఎడిషన్‌లో తన సెంచరీ కలను సాకారం చేసుకున్నాడు. ఉప్పల్ స్టేడియంలో అలజడి సృష్టించిన అతడు మెరుపు శతకం బాదాడు. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 245 పరుగుల ఛేదనలో రెచ్చిపోయిన అభిషేక్.. 141 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ధాటికి పంజాబ్ బౌలర్లు 14 ఫోర్లు, 10 సిక్సర్లు సమర్పించుకున్నారు. 256.36 స్ట్రయిక్ రేటుతో చెలరేగిన అభిషేక్ .. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.
జైపూర్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చితక్కొట్టిన వైభవ్ సూర్యవంశీ సెంచరీతో విజృంభించాడు. 14 ఏళ్లకే ఐపీఎల్లో శతకం బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయిన వైభవ్.. 17 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు చూపిస్తూ గుజరాత్ పేసర్లు ఇషాంత్, కరీమ్ జన్నత్ బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు.
Dreams come true for Vaibhav Suryavanshi ✨ pic.twitter.com/mUmugiv6Xb
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2025
మరో 18 బంతుల్లోనే అంటే.. 35 బంతుల్లోనే వందకు చేరువయ్యాడీ చిచ్చరపిడుగు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్ దిశగా సిక్సర్ సాధించి సెంచరీ అభివాదం చేశాడు. తద్వారా ఈ మెగా లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీ రికార్డు సొంతం చేసుకున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. అయితే.. 30 బంతుల్లోనే శతకం బాదిన మాజీ ఆర్సీబీ ఓపెనర్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
The fastest IPL century by an Indian. At just 14 years old. Bettered only by Chris Gayle.
Vaibhav Suryavanshi, we’re lost for words. pic.twitter.com/ykXtwZRxUG
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2025