Indresh Kumar : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) సమయంలో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సౌదీఅరేబియాలో ఉన్నారు. దాంతో దాడి జరిగిన వెంటనే ప్రధాని ఆదేశాల మేరకు హోంమంత్రి అమిత్ షా (Amith Shah) నే అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ప్రధానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) ‘గాయబ్ (Gayab)’ అనే టెక్స్ట్‌తో ఒక గ్రాఫిక్ ఇమేజ్ను పోస్టు చేసింది. కీలక సమయంలో ప్రధాని మాయమయ్యాడనే ఉద్దేశంతో ఈ పోస్టు పెట్టింది. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా మోదీ సమయానికి అందుబాటులో లేకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.
దీనిపై ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీని తిట్టకపోతే కాంగ్రెస్ నేతలకు తిన్నది అరగడం లేదని, అందుకే వాళ్లు రోజూ ప్రధానిని దూషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం ఒకవేళ పాకిస్థాన్‌పై మిలిటరీ యాక్షన్‌కు సిద్ధపడినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. ఆర్మీ యుద్ధానికి సిద్ధపడితే కాంగ్రెస్ పార్టీ ఆర్మీ కమాండర్‌ను వ్యతిరేకిస్తుందని విమర్శించారు. సమాజంలో కాంగ్రెస్ నేతలు ఏ ఒక్క మంచిపని చేయరని, పైగా మంచిపని చేసేవాళ్లను కించపరుస్తారని ఆరోపించారు. ఇదే వారి రాజకీయ విధానంగా మారిపోయిందని అన్నారు.