Ravi Mohamn | ఇటీవల సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. చిన్న చిన్న మనస్పర్ధలకి విడాకులు తీసుకోవడం అభిమానులని కూడా ఆందోళనకి గురి చేస్తోంది. అయితే తాజాగా తమిళ నటుడు రవి మోహన్ కూడా విడాకులు తీసుకున్నాడు అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తమిళ కథానాయకుడు జయం రవి అంటే మన తెలుగు ప్రేక్షకులు కూడా ఇట్టే గుర్తు పడతారు. కాని తాను రవి లేదా రవి మోహన్ గా అందరికీ తెలియాలని అనుకుంటున్నట్లు ఆయన ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్న సందర్భంగా తన ఆశలు, ఆకాంక్షలు, విలువలు ప్రతిబింబించే విధంగా తన పేరు ఉండాలని కోరుకుంటున్నట్లు, జీవితంలో కొత్త అధ్యాయంలో అడుగుపెడుతున్న సందర్భంగా తన పేరును మార్చుకుంటున్నట్లు ఇతను తెలియజేశారు.
ప్రముఖ ఎడిటర్ మోహన్ రెండో కుమారుడిగా సుపరిచితం అయిన రవి మోహన్ … మణిరత్నం దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల అయింది. ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ హీరో తన పేరు ముందు ‘జయం’ను తీసేయమని రిక్వెస్ట్ చేస్తూ కొన్ని రోజుల ముందు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇక రవి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. అతను ప్రముఖ నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో వివాహం చేసుకోగా, వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రవి- ఆర్తి గతేడాది విడిపోయారు. విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా రవి మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇల్లు తుడిచే వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. శుభ్రంగా ఇంటిని ఒకటికి రెండు సార్లు తుడుచుకోవడనే నా పని అంటూ రవి తన ఇన్స్టాగ్రామ్ వీడియోకి క్యాప్షన్‌గా పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ సర్.. మీరు గ్రేట్’ అని క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నితిన్ హీరోగా తేజ దర్శకత్వం వహించిన జయం సినిమాని తమిళంలో అదే పేరుతో రీమేక్ చేశారు రవి. అప్పటి నుంచి ఆయన పేరు జయం రవి కాగా, ఇప్పుడు… పేరు ముందు జయం తీసేసి, చివరన తన తండ్రి మోహన్ పేరు యాడ్ చేశారు.