వరంగల్ చౌరస్తా : భద్రకాళి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ఆర్యవైశ్యులు తరలిరావాలని పట్టణ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి మాదారపు రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. మే 1వ తేదీ గురువారం రోజున భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉదయం మకర వాహన సేవ, మహిళా మణులచే లలిత సహస్ర పారాయణం, ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పండ్లతో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, పూజ కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తదనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన బ్రహ్మోత్సవ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ తోనుపునూరి వీరన్న, మల్యాల వీర మల్లయ్య, అల్లాడి వీరభద్రయ్య, గుండా మల్లికార్జున్, దాచేపల్లి సీతారాం, టి. సదాశివుడు, బోనగిరి రాజన్న, కొండూరు శివప్రసాద్, గుండా ముక్తీశ్వర్, చకిలం నరసింహమూర్తి, చందా రఘువీర్, అనంతుల శ్రీనివాస్, కంభంపాటి రమణయ్య, ఐతా ప్రసాద్, వేముల శ్రీరాములు, కల్వా నాగరాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.