T20 Sqaud : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముగియకముందే పొట్టి సిరీస్‌పై టీమిండియా దృష్టి సారించనుంది. అక్టోబర్‌లో జరుగబోయే టీ20 సిరీస్ కోసం బీసీసీఐ స్క్వాడ్‌ను ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ సారథిగా 15మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy), పేస్ సంచలనం మయాంక్ యాదవ్(Mayank Yadav)లు డెబ్యూ క్యాప్ అందుకోనున్నారు.
దులీఫ్ ట్రోఫీలో సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు. అతడి బదులు వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మలను తీసుకున్నారు. అక్టోబర్ 6 నుంచి భారత్, బంగ్లాల మధ్య పొట్టి సిరీస్ మొదలవ్వనుంది.
NEWS 🚨 – #TeamIndia’s squad for T20I series against Bangladesh announced.
More details here – https://t.co/7OJdTgkU5q #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/DOyz5XGMs5
— BCCI (@BCCI) September 28, 2024
భారత స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్,