Young Cyclist : సైక్లింగ్నే కెరీర్‌గా తీసుకొని, రికార్డులు బద్ధలు కొట్టాలని కలలు కన్న ఓ అమ్మాయి జీవితం విషాదాంతమైంది. సైక్లింగ్ పోటీల్లో జరిగిన ప్రమాదం ఆమె ప్రాణాలను బలిగొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర సంఘటన ఎక్కడ జరిగిందంటే..? వరల్డ్ రోడ్ రేస్ చాంపియన్‌షిప్స్(World Road Race Chmapionships)లో. స్విట్జర్లాండ్‌లోని జురిచ్ నగరంలో జరుగుతున్నఈ పోటీల్లో పాల్గొన్న సైక్లిస్ట్ మురియెల్ ఫర్రెర్ (Muriel Furrer) అనూహ్యంగా ప్రాణాలు విడిచింది.
సైక్లిస్ట్‌గా రికార్డులు నెలకొల్పాలనే సంకల్పం నెరవేరకుండానే ఆమె 18 ఏండ్ల వయసులోనూ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఎంతో బాధాకరం. ఏం జరిగిందంటే..? గురువారం.. సెప్టెంబర్ 26న నిర్వహించిన మహిళల జూనియర్ రోడ్ రేసులో ఫర్రెర్ ఉత్సాహంగా పోటీపడింది. పర్వతలోయ ప్రాంతం గుండా సాగిన రేసును ఆస్వాదిస్తూ దూసుకెళ్లిన ఆమె పట్టుతప్పి కింద పడిపోయింది. దాంతో, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తమోడుతున్న ఫర్రెను అత్యవసర చికిత్స కోసం హెలిక్యాప్టర్‌లో దవాఖానకు తరలించారు.
Swiss teenage cyclist Muriel Furrer dies after crash at worlds
Read: https://t.co/pAxNeQCFgh pic.twitter.com/GCv0C4SWbQ
— TOI Sports (@toisports) September 27, 2024
అనంతరం డాక్టర్లు ఆమెను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, తలకు బలమైన గాయాలు కావడంతో ఫర్రెర్ను వైద్యులు కాపాడలేకపోయారు. ఎన్నో కలలతో, ఆశలతో సైక్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఆమె చిన్న వయసులోనే మృతి చెందడం అందర్నీ కంటతడి పెట్టించింది.