IPL | ఐపీఎల్లో నవశకం.. తొలిసారి మ్యాచ్ ఫీజు ప్రకటించిన బీసీసీఐ
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ముందే ఓ శుభవార్త. ఈ లీగ్‌లో ఆడుతున్న, ఆడాలనుకుంటున్న క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తీపి కబురు చెప్పింది. క్రికెటర్లకు మరింత ఆర్ధిక లబ్ది చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలానికి ముందే ఓ శుభవార్త. ఈ లీగ్‌లో ఆడుతున్న, ఆడాలనుకుంటున్న క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తీపి కబురు చెప్పింది. క్రికెటర్లకు మరింత ఆర్ధిక లబ్ది చేకూర్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీల్ చరిత్రలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ఆ మెగా టోర్నీలో ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు ప్రకటించింది. ఐపీఎల్ ఆడే క్రికెటర్లకు సైతం మ్యాచ్ ఫీజు చెల్లించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందని సెక్రటరీ జై షా (Jai Shah) వెల్లడించాడు.
రాబోయే సీజన్ నుంచి ఐపీఎల్లో ప్రతి మ్యాచ్‌కు ఆటగాళ్లు రూ.7.5 లక్షలు ఫీజుగా అందుకుంటారని, తద్వారా ఒక ఎడిషన్‌లో ఒక్కో క్రికెటర్ రూ.1.05 కోట్లు ఆర్జిస్తారని షా వివరించాడు. ‘ఐపీఎల్లో అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడే క్రికెటర్‌కు ఒక ఎడిషన్‌లో రూ. 1.05 కోట్ల ఆదాయం సమకూరనుంది.
In a historic move to celebrate consistency and champion outstanding performances in the #IPL, we are thrilled to introduce a match fee of INR 7.5 lakhs per game for our cricketers! A cricketer playing all league matches in a season will get Rs. 1.05 crores in addition to his…
— Jay Shah (@JayShah) September 28, 2024
దాంతో, ఫ్రాంచైజీ అందించే కాంట్రాక్ట్ మొత్తంతో పాటు అదనంగా కోటి రూపాయలు వాళ్ల ఖాతాలో చేరనుంది. ప్రతి ఫ్రాంచైజీ మ్యాచ్ ఫీజుల కిద రూ.12.6 కోట్లు కేటాయిస్తాయ’ని జై షా తన ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించాడు. ఇంకేముంది.. బీసీసీఐ చారిత్రక నిర్ణయం పట్ల క్రికెటర్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక 18వ సీజన్ ఐపీఎల్‌కు ముందే మెగా వేలం జరుగనుంది. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేలం నిర్వహించే అవకాశముంది.
ఇవి కూడా చదవండి
- Actress Roja | జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయలేరు.. చంద్రబాబుపై రోజా ఫైర్
- Electrocution | పశ్చిమ బెంగాల్లో విషాదం.. ఆవును కాపాడబోయి నలుగురు మృతి
- CJI Chandrachud | తిరుమలకు చేరుకున్న సీజేఐ చంద్రచూడ్ .. రేపు శ్రీవారి దర్శనం
- Ajith Kumar | రేసింగ్ ట్రాక్‌పై స్టార్ హీరో దూకుడు.. కొత్త టీమ్‌తో హల్చల్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

