అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ (CJI Chandrachud ) శనివారం రాత్రి తిరుమల(Tirumala) కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి విమానంలో వచ్చిన ఆయనకు రేణిగుంట (Renigunta ) విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో రాత్రి బస చేసి ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. సీజేఐ రాక సందర్భంగా తిరుమలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.