Ajith Kumar | రేసింగ్ ట్రాక్‌పై స్టార్ హీరో దూకుడు.. కొత్త టీమ్‌తో హల్చల్..!
Ajith Kumar : కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) అంటే యాక్షన్ సినిమాలే కాదు రేసర్‌గా అతడి బైక్ విన్యాసాలు గుర్తుకొస్తాయి. స్పోర్ట్స్ బండిని రయ్‌మంటూ రాకెట్ స్పీడ్‌తో ఉరికించడమంటే అతడికి మహా సరదా. ఇప్పటివరకూ రేసర్‌గానే మనందరికి తెలిసిన ఈ స్టార్ హీరో కారు రేసింగ్‌లోకి మరో ముందుడుగు వేశాడు.
Ajith Kumar : కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) అంటే యాక్షన్ సినిమాలే కాదు రేసర్‌గా అతడి బైక్ విన్యాసాలు గుర్తుకొస్తాయి. స్పోర్ట్స్ బండిని రయ్‌మంటూ రాకెట్ స్పీడ్‌తో ఉరికించడమంటే అతడికి మహా సరదా. స్వతహాగా రేసర్ అయిన అజిత్ షూటింగ్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు బైక్ , కారుఎక్కేసి లాంగ్ డ్రైవ్‌లకు వెళుతుంటాడు. ఇప్పటివరకూ రేసర్‌గానే మనందరికి తెలిసిన ఈ స్టార్ హీరో కారు రేసింగ్‌లోకి మరో ముందుడుగు వేశాడు.
ఈమధ్యే అజిత్ సొంతంగా ‘అజత్ కుమార్ రేసింగ్’ అనే పేరుతో టీమ్‌ను ప్రారంభించాడు. పాపులర్ రేసింగ్ డ్రైవర్ అయిన ఫాబియన్ డఫ్లెక్స్ (Fabien Duffleux) అజిత్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. త్వరలో జరుగబోయే 24 గంటల యూరోపియన్ సిరీస్ పోర్షే 992 జీటీ3 కప్ విభాగంలో అజిత్ రేసింగ్ టీమ్ పోటీ పడనుంది.
Ajith Kumar Racing 🏁
We are proud to announce the beginning of a new exciting adventure: Ajith Kumar Racing 🏁
Fabian Duffieuxwill be the official racing driver 🔥
And the amazing news? Aside of being a team owner, Ajith Kumar is back in the racing seat!
Ajith is among very… pic.twitter.com/KiFELoBDtO
— Suresh Chandra (@SureshChandraa) September 27, 2024
ఓవైపు సినిమాలతో మలయాళ, తెలుగు అభిమానులను అలరిస్తూనే అజిత్ రేసింగ్‌ను కొనసాగిస్తున్నాడు. గతంలో అతడు ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్) పోటీల్లో పాల్గొన్నాడు. 2004లో జరిగిన ఆసియా బీఎండబ్ల్యూ ఎఫ్ 3 చాంపియన్‌షిప్స్‌లోనూ అజిత్ రయ్‌మంటూ దూసుకెళ్లాడు.
వచ్చే ఏడాది జనవరిలో
అజిత్ తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) అనే సినిమాలో నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్. యాక్షన్, కామెడీ కలగలసిన ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. దాదాపు షూటింగ్ పూర్తికావొచ్చిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగులో డబ్ అయిన ‘జోడీ’, ‘వలిమై’, ‘విశ్వాసం’, ‘ఎంతవాడుగానీ’.. వంటి చిత్రాలు అజిత్‌ను తెలుగు అభిమానులకు దగ్గర చేశాయి.
ఇవి కూడా చదవండి
- Fab-4 Bowlers | ఫ్యాబ్- 4లో భారత పేసర్లు.. మిగతా ఇద్దరు వీళ్లే..!
- Hassan Nasrallah | ‘ఇజ్రాయెల్‌పై పోరాటాన్ని కొనసాగిస్తాం’.. నస్రల్లా మరణాన్ని ధృవీకరించిన హిజ్బుల్లా
- Digital Health Cards | మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ కార్డులు : సీఎం రేవంత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

