Rajinikanth | తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం..! సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందన ఇదే..!
Rajinikanth | తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు.
Rajinikanth | తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్ స్టార్ రజనీకాంత్‌ని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆసక్త కనబరచలేదు. రజనీకాంత్ ప్రస్తుతం వేట్టయాన్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై స్పందన మీ స్పందన ఏంటీ? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రజనీ సారీ నో కామెంట్స్ అంటూ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. కార్తీపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు.. ‘లడ్డూలపై మాట్లాడొద్దు.. సున్నితమైన అంశం’ సమాధానం ఇచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ కాగా.. కార్తీపై మండిపడ్డారు. సనాతన ధర్మంపై ఎవరూ సరదాగా మాట్లాడొద్దని.. నటులు హుందాగా మాట్లాడాలని.. లేకపోతే మౌనంగా ఉండాలన్నారు. లడ్డూ వివాదంపై జోకులేయొద్దంటూ హెచ్చరించారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా కార్తీ సారీ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ లడ్డూలపై ప్రశ్న ఎదురవగా.. ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెళ్లిపోవడం గమనర్హాం. రజనీకాంత్ నటించిన వేట్టయాన్ వచ్చే నెల 10న విడుదల కానున్నది. ఈ మూవీలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రానా దగ్గుబాటి, అభిరామి కీలపాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

