IPL 2025 : ఐపీఎల్ మెగా వేలానికి ముందు రిటెన్షన్ విధానం(Retension Rule)పై నెలకొన్నఉత్కంఠకు బీసీసీఐ(BCCI) తెరదించింది. శనివారం ఐపీఎల్ గవర్నింగ్ మండలి సమావేశం ముగిసినా కాసేపటికే ప్రకటన చేసింది. ప్రతి ఫ్రాంచైజీకి ఐదుగురిని అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది. గత సీజన్లో నలుగురికే అనుమతిచ్చిన బీసీసీఐ ఫ్రాంచైజీల అభ్యర్థనల దృష్ట్యా ఈసారి పోల్చితో ఈసారి ఐదుగురిని రిటైన్ చేసుకోవచ్చని తెలిపింది.
మరో విషయం ఏంటంటే.. ఈ ఐదుగురిలో భారత ఆటగాళ్లు ఎందరు ఉండాలి? విదేశీ క్రికెటర్లు పరిమితి ఎంత? అనేది ఫ్రాంచైజీలకే వదిలేసింది. అయితే రైటు టు మ్యాచ్ విధానాన్ని మాత్రం ఒక్క ఆటగాడికే పరిమితం చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఇక మెగా వేలంలో ఆటగాళ్లను కొనేందుకు ప్రతి ఫ్రాంచైజీ పర్స్ వాల్యూని బీసీసీఐ అమాంతం పెంచేసింది. నిరుడు మినీ వేలలో రూ. 100 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.120 కోట్లకు పెంచింది. దాంతో, గెలుపు గుర్రాల కోసం వేలంలో ఫ్రాంచైజీలు ఎంత చెల్లించేందుకైనా వెనకాడకపోవచ్చు. అంతేకాదు రీటైన్ చేసుకొనే ఆటగాళ్లకు ఎంత చెల్లించాలి? అనేది కూడా బీసీసీఐ వెల్లడించింది.
మొదటి రిటెన్షన్‌కు రూ.18 కోట్లు.
రెండో రిటెన్షన్ రూ. 14 కోట్లు.
మూడో రిటెన్షన్ రూ. 11 కోట్లు
నాలుగో రిటెన్షన్ రూ. 18 కోట్లు.
ఐదో రిటెన్షన్ రూ. 14 కోట్లు
ఆనవాయితీ ప్రకారం ప్రతి మూడేండ్లకు ఓసారి ఐపీఎల్ మెగా వేలం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఆక్షన్ సమయం రానే వచ్చింది. బీసీసీఐ నుంచి రిటెన్షన్‌కు సంబంధించి ప్రకటన కూడా వచ్చేసింది. దాంతో, 10 ఫ్రాంచైజీలు ఎవరిని అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వదిలేయాలి? అనే జాబితా తయారు చేసుకునే పనిలో ఉన్నాయి.