Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ పోటీలకు మరికాసేపట్లో తెరపడనుంది. 17 రోజులుగా ప్రపంచాన్ని అలరించిన ఈ విశ్వ క్రీడా సంబురం మరికాసేపట్లో అట్టహాసంగా ముగియనుంది. ఈ మెగా ఈవెంట్లో ఆఖరి పతకాన్ని అమెరికా (America) ఒడిసిపట్టింది. ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్‌బాల్ పోటీలో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణం తన్నుకుపోయింది. దాంతో, పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న చైనా(China)కు అమెరికా గట్టి షాకిచ్చింది.
యూఎస్ఏ 40 గోల్డ్ మెడల్స్‌తో చైనాతో సంయుక్తంగా టాప్‌లో నిలిచింది. విశ్వ క్రీడల్లో 20 పసిడి పతకాలు కొల్లగొట్టిన జపాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. టోక్యోతో పోల్చితే ఈసారి ఆరు పతకాలకే పరిమితమైన భారత్ (India) 71వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది.
The streak continues for USA Women’s Basketball Team 🇺🇸🏀 :
2024 -🥇
2020 -🥇
2016 -🥇
2012 -🥇
2008 -🥇
2004 -🥇
2000 -🥇
1996 -🥇#Paris2024
📸Getty Images/Sarah Stier pic.twitter.com/ehKS3Cj64Z— Paris 2024 (@Paris2024) August 11, 2024
గత నెల జూలై 26న మొదలైన విశ్వ క్రీడా సంబురం ఆదివారం అట్టహాసంగా ముగియనుంది. ఈ క్రీడల్లో చైనా, అమెరికాలు పోటాపోటీగా పతకాలు కొల్లగొట్టాయి. అయితే.. ఆఖరి రోజున అమెరికా 40 స్వర్ణాలతో చైనాతో సరిసమానంగా నిలిచింది. జపాన్, ఆస్ట్రేలియా, ఆతిథ్య ఫ్రాన్స్‌లు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. ఇక టాప్ 10లో ఏ దేశాలు ఉన్నాయో చూద్దాం..
1. అమెరికా (126 పతకాలు) – 40 స్వర్ణాలు – 44 రజతాలు – 42 కాంస్యాలు.
2. చైనా (91 పతకాలు) – 40 స్వర్ణాలు – 27 రజతాలు – 24 కాంస్యాలు.
3 – జపాన్ – (45 పతకాలు) – 20 స్వర్ణాలు – 12 రజతాలు – 13 కాంస్యాలు.
4. ఆస్ట్రేలియా – (53 పతకాలు) – 18 స్వర్ణాలు – 19 రజతాలు – 16 కాంస్యాలు.
5. ఫ్రాన్స్ – (64 పతకాలు) – 16 స్వర్ణాలు – 26 రజతాలు – 22 కాంస్యాలు.
ओलंपिक खेलों में भारत के लिए एक और पदक जीतके बहुत अच्छा लगा। इस बार पेरिस में हमारा National Anthem नहीं बज पाया, लेकिन आगे की मेहनत उसी पल के लिए होगी।💪
Very proud to be on the podium for India once again at the Olympic Games. Thank you for the love and support. Jai Hind! 🇮🇳… pic.twitter.com/b2DoatANPn
— Neeraj Chopra (@Neeraj_chopra1) August 10, 2024
6. నెదర్లాండ్స్ (34 పతకాలు) – 15 స్వర్ణాలు -7 రజతాలు – 12 కాంస్యాలు.
7. గ్రేట్ బ్రిటన్ (65 పతకాలు) – 14 స్వర్ణాలు – 22 రజతాలు – 29 కాంస్యాలు.
8. రిపబ్లిక్ ఆఫ్ కొరియా (32 పతకాలు) – 13 స్వర్ణాలు – 9 రజతాలు – 10 కాంస్యాలు.
9. ఇటలీ (40 పతకాలు) – 12 స్వర్ణాలు – 13 రజతాలు – 15 కాంస్యాలు.
10. జర్మనీ (33 పతకాలు) – 12 స్వర్ణాలు – 13 రజతాలు – 8 కాంస్యాలు.
71. భారత్ (6 పతకాలు) – 0 స్వర్ణాలు – 1 సిల్వర్ – 5 కాంస్యాలు.