Arshad Nadeem : పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్ విజేతగా పాకిస్థాన్(Pakistan)లో అడుగుపెట్టిన అతడికి పెద్ద సంఖ్యలో జనం నీరాజనాలు పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నదీమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవీ (Saroj Devi)పై ప్రశంసలు కురిపించాడు. ఆమె తనకు కూడా తల్లి అని నదీమ్ తెలిపాడు.
”ఒక అమ్మ ప్రతి ఒక్కరికీ అమ్మే. అందుకనే అమే ప్రతిఒక్కరి కోసం ప్రార్ధిస్తుంది. నీరజ్ చోప్రా తల్లికి నేను ఎంతో కృతజ్ఞుడిని. ఆమె నాకు కూడా అమ్మనే. ఎందుకంటే ఆమె నా విజయం కోసం కూడా పూజలు చేసింది. దక్షిణ ఆసియా నుంచి ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శన చేసింది నీరజ్, నేను ఇద్దరమే’ అని నదీమ్ వెల్లడించాడు.
Neeraj Chopra mother is my mother, she prayed for us, I am really thankful to her ❣️pic.twitter.com/oepBukXRJZ
— ٰImran Siddique (@imransiddique89) August 11, 2024
ఒలింపిక్స్లో రికార్డు త్రోతో నదీమ్ స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. ఫైనల్లో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పాక్కు తొలి పసిడిని అందించాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో పసిడిని ముద్దాడిన నీరజ్.. పారిస్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో భారత స్టార్ అథ్లెట్ 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి వరుసగా రెండో పతకంతో చరిత్ర లిఖించాడు.
In this video, Saroj Devi says, “We are very happy with the silver, the one who got gold is also our child and the one who got silver is also our child….”
You won’t find this bit in ANI’s caption. https://t.co/yXAXqsn81c
— Shinjinee Majumder (@shinjineemjmdr) August 9, 2024
ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్ తర్వాత నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత్, పాక్ మధ్య శతృత్వం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఆమె తన ప్రేమగుణంతో సరిహద్దులు చెరిపేసింది. ‘సిల్వర్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. పసిడి పతకం గెలిచిన నదీమ్ కూడా మాబిడ్డనే’ అని సరోజ్ అంది. దాంతో, ఒక్కసారిగా ఆమె ఇంటర్నెట్లో సెన్షేషనల్ అయింది. అటు నదీమ్ తల్లి రజియా పర్వీన్ (Raziah Parveen) సైతం నీరజ్ తనకు కుమారుడితో సమానమని చెప్పింది. ‘అతడు నదీమ్ స్నేహితుడు. అంతేకాదు ఒక సోదరుడి లెక్క’ అని పర్వీన్ అంది. దాంతో, ఈ ఇద్దరు తల్లుల విశాల హృదాయన్ని భారత్, పాక్ ప్రజలు వేనోళ్ల పొగుడుతున్నారు.