Mahua Maji : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వహించిన శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడు హాస్పిటల్తో ఎలాంటి సంబంధం లేని బయటి వ్యక్తి అని, ఘటన జరిగిన రోజు అతను దవాఖానలోని అన్ని విభాగాలలో స్వేచ్ఛగా తిరిగాడని పోలీసులు శనివారం తెలిపారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ నేరంతో అతడికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు వారు చెప్పారు.
కాగా, ఈ ఘటనపై జేఎంఎం ఎంపీ మహువ మాఝీ స్పందించారు. ఈ తరహా ఘటనలు ఎక్కడ జరిగినా వాటిని తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఈ ఘటనలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి దోషులను తక్షణమే గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం తగదని ఆమె పేర్కొన్నారు.
Read More :
Gold | దుబాయ్ టు హైదరాబాద్.. ఎయిర్పోర్టులో భారీగా బంగారం సీజ్