MGM | మట్టెవాడ : వరంగల్ ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతిన్న ఘటనను నిరసిస్తూ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా దవాఖాన ఎదుట ధర్నా చేసిన మాజీ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు తొమ్మిది మందిపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
మట్టెవాడ సీఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. మూడురోజుల క్రితం ఎంజీఎంలో శిశువును కుక్కలు పీక్కుతింటున్న ఘటనను నిరసిస్తూ శనివారం మాజీ ఎమ్మెల్యే నరేందర్ తన కార్యకర్తలతో ఆసుపత్రి గేటు ఎదుట ధర్నా చేశారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా మాజీ ఎమ్మెల్యేతోపాటు 34వ డివిజన్ కార్పొరేటర్ కుమారస్వామి, రవి, కొంగ రాజేందర్, ఎలగంటి సతీశ్, ఎలగంటి మధు, సీతారాం, బజ్జూరి వాసు, తోట స్రవంతిలపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ప్రజలు, నాయకులు ఎవరైనా నిరసన, ధర్నాకు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. లేకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Nagarjuna Sagar | శ్రీశైలం నుంచి తగ్గిన ఇన్ఫ్లో.. 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ నీటి విడుదల
Rains | రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచన..! ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!!
Minister Rammohan Naidu | నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు