Ravula Sridhar Reddy | బండి సంజయ్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి : రావుల శ్రీధర్ రెడ్డి
Ravula Sridhar Reddy | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో రావుల శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Ravula Sridhar Reddy | హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో రావుల శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్‌ను జైళ్లో వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ చెప్పడం ఏంటని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఏం తప్పు చేశారని జైల్లో పెడతారు అని నిలదీశారు. గతంలో ఎంపీ హోదాలో మసీదులు తవ్వాలే, శవాలు తవ్వాలే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పోనీలే అని అనుకున్నాం, కానీ ప్రస్తుతం కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా కొద్దిగా బుద్దిజ్ఞానం తెచ్చుకుని మాట్లాడుతారు అనుకుంటే, కేటీఆర్‌ను జైళ్లో వేస్తామని మాట్లాడం ఏంటని, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో బండి సంజయ్‌ను చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పదేళ్లు రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని.. ఆ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అని బండి సంజయ్‌కు శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు. ఏదో నరేంద్రమోదీ, జైశ్రీరామ్ నినాదం వల్ల సంజయ్‌కు పదవి వచ్చిందని, ఈ పదవితో కేటీఆర్‌ను విమర్శిస్తే మాత్రం సహించేది లేదు అని శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Olympics 2036 | భారత్‌కు పోటీగా ఈజిప్ట్.. ఒలింపిక్స్ హక్కులు ఎవరికో..?
KTR | బహ్రెయిన్ జైలులో సిరిసిల్ల వాసి.. స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రికి కేటీఆర్ లేఖ
KP Vivekananda | నిరుద్యోగులను నిండా ముంచారు.. పెట్టుబడులు పోకుండా చూడాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bandi Sanjay
- BJP
- BRS party
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

