KP Vivekananda | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్నీ అటకెక్కించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులను నిండా ముంచారని ఆరోపించారు. నిరుద్యోగులు పోరాడుతున్నా బీజేపీనాయకులు మద్దతు ఇవ్వరని.. బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో 25 లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించినం. బీఆర్ఎస్ హయాంలో ఐటీ సెక్టార్లో 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి. కాంగ్రెస్ పాలనలో అన్నీ దిగజారుతున్నాయి. అమరరాజా కంపెనీ తెలంగాణ నుంచి తరలిపోతామని చెప్తోందని.. ఉన్న పెట్టుబడులు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని సూచించారు. బీజేపీ నాయకులు భావ దారిద్ర్యంతో ఉన్నారు. భూములులాక్కుంటున్నారని కొడంగల్ రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.. రేవంత్‌కు సహాయ మంత్రిగా మారిపోయారని, రేవంత్ రెడ్డికి కోవర్టుగా పనిచేస్తున్నారని విమర్శించారు.
అమెరికాలో సోదరుడి కంపెనీతో రేవంత్ అగ్రిమెంట్ చేసుకున్నరు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆ ఒప్పందాన్ని సమర్థించారు. ఆ ఒప్పందం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి వస్తుంది. సుంకిశాల ప్రమాదం చిన్నది అన్నట్టుగా చూపిస్తున్నరు.. కాంట్రాక్ట్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాలి. 2వ తేదీన సుంకిశాల ప్రమాదం జరిగింది. సోషల్ మీడియాలో వస్తే కానీ ప్రభుత్వానికి తెలియలేదు. ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టే అర్థమవుతోందని ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు.
Fire Incident | విశాఖ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. సీఈవో గది దగ్ధం
Tungabhadra Dam | వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేట్.. వీడియో