అమరావతి : విశాఖపట్నం(Visakapatnam) లో వారం రోజుల వ్యవధిల్లో రెండు ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద ఘటనలు జరుగడం పట్ల రోగులు కలవర పాటుకు గురవుతున్నారు. మెడికవర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటనను మరవకముందే ఆదివారం విశాఖ సెవెన్‌హిల్స్ ఆస్పత్రి (Sevenhills Hospitals) ఐదో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. దట్టంగా పొగలు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో ఆస్పత్రి సీఈవో గది(CEO Room) పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే (Short circuit) కారణమని అనుమానిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం అగ్నిప్రమాదం జరిగిన సెవెన్‌హిల్స్ ఆస్పత్రిని విశాఖ సీపీ శంకభ్రత బాగ్చీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారని తెలిపారు. రోగులకు ఎలాంటి ముప్పులేదని ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందని వివరించారు. అన్ని ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని, రెండు వారాల్లో అన్ని ఆస్పత్రులు భద్రత ప్రమాణాలు పెంచుకోవాలి సూచించారు.