Tungabhadra Dam | బెంగళూరు : కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేట్ కొట్టుకుపోయినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో రాత్రి నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. 60 టీఎంసీల నీరు వృథాగా పోతుంది. కొట్టుకుపోయిన గేటు నుంచి 75 వేల క్యూసెక్కులు వృథాగా పోతోంది. కొట్టుకుపోయిన గేటుపై భారం పడకుండా మరో 7 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొట్టుకుపోయిన గేటు సహా 8 గేట్ల నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది.
కర్ణాటక శివమొగ్గలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు వరద నీరు పోటెత్తింది. తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. వరద ఎక్కువగా ఉండడంతో మరమ్మతులకు ఆటంకం కలుగుతోంది. తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు అధికారులు ఖాళీ చేయనున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేశాక కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
కర్ణాటకలో కొట్టుకుపోయిన డ్యామ్ గేట్
కర్ణాటక – తుంగభద్ర నది ఉద్ధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేట్
ఈ గేట్ ద్వారా భారీగా 35 వేల క్యూసెక్కులు, మొత్తంగా 48 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు వెళ్తున్నాయి. pic.twitter.com/nJMPP18ryF
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2024
ఇవి కూడా చదవండి..
Accident | ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన పెను ప్రమాదం
Nagarjuna Sagar | సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు.. పోలీసుల ఆక్షలు
KTR | ఆమె నుంచి చాలా నేర్చుకున్నా..: కేటీఆర్