హైదరాబాద్: యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్కికీ మరణవార్త చాలా బాధ కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అత్యంత డైనమిక్‌గా ఉండే వోజ్కికీ ఎంతో తెలివైన వారని.. ఆమెతో పలు సందర్భాలలో మాట్లాడటం ద్వారా చాలా నేర్చుకున్నానని చెప్పారు. సుసాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు కేటీఆర్ సంతాపం తెలిపారు.
యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ శనివారం కన్నుమూశారు. 56 ఏండ్ల సుసాన్ గత రెండేండ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. ఇంటర్నెట్ను రూపొందించడంలో, గూగుల్ చరిత్రలో ఆమె విశేష పాత్ర పోషించారు. 1990లో గూగుల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన సుసాన్ యూట్యూబ్ సీఈవోగా 2014 నుంచి 2023 వరకు పనిచేశారు. గూగుల్ చరిత్రలో వోజ్కికీ అతి ప్రధానమైన వ్యక్తని, ఆమె లేని లోకాన్ని ఊహించడం కష్టంగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు.
Saddened to hear of the demise of the dynamic Susan Wojcicki, Former CEO of YouTube who I had the pleasure of interacting with on a few occasions
Prayers for her family and friends. May her soul rest in peace pic.twitter.com/eAkaIRTMaT
— KTR (@KTRBRS) August 11, 2024