Drishyam 3 | మలయాళం నుంచి క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చి దక్షిణాది భాషల్లో సూపర్ క్రేజ్ సంపాదించిన ప్రాంచైజీ ప్రాజెక్ట్ దృశ్యం (Drishyam).జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడీ ప్రాంచైజీలో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు మరోసారి దృశ్యం 3 (Drishyam 3) కూడా వస్తుందని తెలిసిందే.
మోహన్ లాల్ (Mohan lal), మీనా కాంబోలో వస్తోన్న దృశ్యం3 2025 సెప్టెంబర్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది. దృశ్యం ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఇప్పటికీ క్యూరియాసిటీతో ఎదురుచూసేలా చేస్తున్న సినిమా అని అన్నాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఎలాంటి భారీ అంచనాలు పెట్టుకోకుండా చూసే ప్రాంచైజీ ఇదని.. దృశ్యం 3 2026 ఏప్రిల్ తొలివారంలో మీ ముందుకు వస్తోందని ప్రకటించాడు.
మొత్తానికి మూవీ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న దృశ్యం థర్డ్ పార్టు రిలీజ్‌కు సంబంధించి డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్రేజీ వార్తను షేర్ చేసి మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. జార్జ్‌కుట్టీ ప్రపంచంలోకి మరోసారి తీసుకొస్తూ.. అంటూ మోహన్ లాల్ చాలా రోజుల క్రితం షేర్ చేసిన ఫొటో ఒకటి ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతోంది.
దశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. రెండు పార్టులను తెరకెక్కించిన ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని కూడా తెరకెక్కిస్తోంది. కాగా హిందీలో అజయ్ దేవ్గన్, శ్రియా కాంబోలో దృశ్యం 3 కూడా తెరకెక్కుతుండగా.. ఈ మూవీని 2026 అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అంటే ఒరిజినల్ (మలయాళం) వెర్సన్ రిలీజైన 6 నెలల తర్వాత హిందీలో రాబోతుందన్నమాట.
NBK 111 | బాలయ్య సినిమా నుండి స్టార్ హీరోయిన్ ఔట్.. అదే కారణమా?