Dangerous Stunts | కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లపై బైక్‌లతో ప్రమాదకరమైన స్టంట్లు (Dangerous Stunts) చేస్తున్నారు. సోషల్ మీడియా (Social Media) లో ఫేమస్ అయ్యేందుకు ఫీట్లు చేస్తూ.. ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని మైసూరు నగరంలో (Mysuru city) ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల ముందే స్టంట్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. అర్ధరాత్రి వేళ రోడ్డుపై అతివేగంగా వేళ్తూ ప్రమాదకరంగా ప్రయాణించారు. వీరి చర్యకు అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ తతంగాన్ని ప్రత్యక్షంగా చూసిన పోలీసులు వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. భారీగా జరిమానా విధించారు.
A video showing a group of youths performing dangerous bike wheelies right in front of police officers in #Mysuru city has gone viral on social media.
The video has sparked outrage, prompting the police to take suo motu cognisance of the matter. pic.twitter.com/r14Sl10XGb
— Hate Detector 🔍 (@HateDetectors) January 7, 2026
Also Read..
Demolition | ఢిల్లీ మసీదు వద్ద పోలీసులకు, స్థానికులకు మధ్య ఘర్షణలు.. పరిస్థితి ఉద్రిక్తం..!
Lalu Yadav | సైనిక శిక్షణకు లాలూ మనవడు.. ఏ దేశంలో అంటే..?