అమరావతి : ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha ) కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. మంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం సైనిక పాఠశాలలో విగ్రహం ఆవిష్కరణకు బయలు దేరారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం జాతీయరహదారి (National Highway) వాహనం వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది.
బైక్ను తప్పించే సమయంలో మంత్రి ఎస్కార్ట్ వాహన (Escort Vehicle) డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేశారు. దీంతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.