IND vs USA : పొట్టి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న అమెరికా(USA) సూపర్ – 8కు అడుగు దూరంలో నిలిచింది. తొలి పోరులో కెనడా.. అనంతరం మాజీ చాంపియన్ పాకిస్థాన్‌కు షాకిచ్చిన మొనాక్ పటేల్ (Monak Patel) బృందం మూడో మ్యాచ్‌కు సిద్దమైంది. అది కూడా టైటిల్ ఫేవరెట్ టీమిండియా(Team India)తో న్యూయార్క్‌లో తలడపనుంది. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు అమెరికా హిట్టర్ అరోన్ జోన్స్ (Aaron Jones) సంచనల వ్యాఖ్యలు చేశాడు. గతంలో తాము పెద్ద జట్లను ఓడించామని.. భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని జోన్స్ అన్నాడు.
న్యూయార్క్‌లో మంగళవారం మీడియా సమావేశంలో జోన్స్ మాట్లాడాడు. ‘భారత్‌కు మేము గట్టి పోటీనిస్తాం. ప్రతి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాం. టీమిండియాపై కూడా భయం లేకుండా ఆడి టాప్‌లోకి రావాలనుకుంటున్నాం. అందుని మేము గట్టిగా శిక్షణ తీసుకుంటున్నాం. గత రెండు వారాలుగా మేమంతా జట్టుగా బాగా ఆడుతున్నాం. బుధవారం భారత్‌పై కూడా మేము దూకుడుగానే ఆడుతాం. గతంలో పెద్ద జట్లను మేము ఓడించాం’ అని జోన్స్ తెలిపాడు.
Aaron Jones dominates as the top six hitter of the 2024 @ICC @T20WorldCup! 🤩🔥#T20WorldCup | #WeAreUSACricket 🇺🇸 pic.twitter.com/fmM4y7fcJU
— USA Cricket (@usacricket) June 11, 2024
భారత జట్టు నుంచి ఎదురయ్యే అతి పెద్ద ఛాలెంజ్? అనే ప్రశ్నకు ఈ హిట్టర్ బుమ్రానే అని అన్నాడు. ‘ఆ విషయం నేను చెప్పాలనుకోవడం లేదు. అయితే.. న్యూయార్క్ వికెట్ చూస్తే.. బుమ్రా నుంచి సవాల్ ఎదురవ్వొచ్చు. అయితే.. మైదానంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వికెట్ ఎలా స్పందిస్తుందో మాకే తెలియదు’ అని జోన్స్ వెల్లడించాడు. ఆరంభ పోరులో కెనడాపై జోన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో, వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు లక్ష్యాన్ని ఊదేసిన మూడో జట్టుగా అమెరికా పుస్తకాల్లోకి ఎక్కింది.
USA bracing up for another epic clash 🔥#T20WorldCup #USAvIND pic.twitter.com/CDk2Tn5GZP
— ICC (@ICC) June 12, 2024
మరోవైపు.. భారత జట్టు వరల్డ్ కప్‌లో విజయాలతో దూసుకెళ్తోంది. తొలి పోరులో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. అనంతరం బుమ్రా సంచలన బౌలింగ్‌తో దాయాది పాకిస్థాన్‌పై 6 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. అమెరికాపై కూడా జయభేరి మోగిస్తే రోహిత్ బృందం 6 పాయింట్లతో సూపర్ 8కు చేరడం ఖాయం. లో స్కోర్లు నమోదవుతున్న నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో అమెరికాను అల్లాడించేందుకు భారత సైన్యం సిద్ధమైంది.