హైదరాబాద్ : తలసాని శంకర్ యాదవ్(Shankar Yadav) కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ కార్మికుల పక్షపాతిగా నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ సోమవారం మరణించగా మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లు వెస్ట్ మారేడ్ పల్లిలోని రాధికా కాలనీలో గల శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొని శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులు(Tributes) అర్పించారు.
అనంతరం తలసాని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. శంకర్ యాదవ్ గతంలో బోయిన్పల్లి మార్కెట్ ట్రేడర్స్ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో కూడా కార్మికులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూఅన్నివిధాలుగా అండగా నిలిచే వారని గుర్తు చేశారు. అందరూ శంకర్ అన్న అని ఎంతో ప్రేమగా పిలుచుకునే శంకర్ యాదవ్ మృతి చాలా బాధాకరం అన్నారు.